అభిమానుల హంగామా: రౌడీ హీరో‌ ఎమోషనల్‌

19 Jan, 2021 18:31 IST|Sakshi

రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ తాజాగా నటిస్తున్న చిత్రం 'లైగర్'‌. ఈ సినిమా రిలీజవకముందే ఫ్యాన్స్‌ సంబరాలు మొదలుపెట్టారు. టైటిల్‌ను టాటూ వేయించుకుంటూ హడావుడి చేస్తున్నారు. పోస్టర్‌కు బీరాభిషేకం చేస్తూ భక్తిని చాటుకుంటున్నారు. కేకు కటింగులు చేస్తూ వేడుకలు చేస్తున్నారు. సినిమాకు గుమ్మడికాయ కొట్టకముందే పోస్టర్‌ ముందు కొబ్బరికాయలు కొడుతున్నారు. ఈ హంగామా అంతా విజయ్‌ కంట పడనే పడింది. దీంతో వేడుకలకు సంబంధించిన వీడియోను షేర్‌ చేస్తూ విజయ్‌ భావోద్వేగానికి లోనయ్యాడు.(చదవండి: బీరాభిషేకం, చేతిపై టాటూతో ‘రౌడీ’ ఫ్యాన్స్‌ రచ్చ రచ్చ)

"నిన్న మీరు చేసిన పనికి నేను చాలా ఎమోషనల్‌ అయ్యాను. మీ ప్రేమ నా మనసును తాకింది. ఒకప్పుడు అనుకునేవాడిని.. నా పనితనాన్ని ఎవరు గుర్తిస్తారు? నా సినిమా ఎవరు చూస్తారు? అని! కానీ నిన్న కేవలం లైగర్‌ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ రిలీజ్‌ చేసినందుకే రాష్ట్రవ్యాప్తంగా పండగ వాతావరణాన్ని సృష్టించి నన్ను కదిలించారు. ఇప్పుడు చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి.. మీరు టీజర్‌ కోసం వెయిట్‌ చేయండి. దేశమంతా పిచ్చెక్కించడం గ్యారెంటీ.. ప్రేమతో మీ మనిషి విజయ్‌ దేవరకొండ" అని రాసుకొచ్చాడు. నీ కష్టమే నిన్ను ఇక్కడివరకు తీసుకొచ్చిందని, నువ్వు నిజమైన హీరో అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి లైగర్‌ పేరు బాగోలేదంటూ సోషల్‌ మీడియాలో కొంత నెగెటివిటీ కనిపించినా ఈ సంబరాలను చూసేసరికి చిత్రయూనిట్‌కు కాస్త ఉపశమనం లభించినట్లైంది. ఈ సినిమాలో ఫైటర్‌గా కనిపించనున్న విజయ్‌ సరసన బాలీవుడ్‌ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. చార్మీ, కరణ్‌ జోహార్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. (చదవండి: స్పెషల్‌ సాంగ్‌..మోనాల్‌కు అంత రెమ్యునరేషనా?)

A post shared by Vijay Deverakonda (@thedeverakonda)

మరిన్ని వార్తలు