Vijay Devarakonda Liger Movie: 'మా అయ్య తెల్వడు, తాత తెల్వడు.. ఏందిరా ఈ మెంటల్‌ మాస్'!

21 Jul, 2022 13:03 IST|Sakshi

సెన్సేషనల్‌ స్టార్‌ విజయ్‌ దేవరకొండ నటించిన లేటెస్ట్‌ మూవీ 'లైగర్‌'. ఈ సినిమా రిలీజ్‌ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అభిమానులకు లైగర్‌ ట్రైలర్‌తో ట్రీట్‌ ఇచ్చారు మూవీ టీం. హైదరాబాద్‌లోని సుదర్శన్‌ థియేటర్‌లో గ్రాండ్‌గా లైగర్‌ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా అభిమానులను ఉద్దేశించి విజయ్‌ దేవరకొండ మాట్లాడుతూ.. 'మీకు మా అయ్య తెల్వడు, మా తాత తెల్వడు, ఎవ్వడూ తెల్వదు. నా సినిమా రిలీజ్ అయ్యి రెండేళ్లు అయితుంది.

ఆ సినిమా కూడా పెద్దగా చెప్పుకునే సినిమా కాదు. అయినా ట్రైలర్‌కి ఈ రచ్చ ఏందిరా నాయనా? ఏందిరా ఈ మెంటల్‌ మాస్! మీ ప్రేమకు ఐ లవ్‌ యూ. ఈ సినిమా కోసం బాడీ, ఫైట్స్‌, డ్యాన్స్‌ చేసినా అంటే అది మీ కోసమే. ఈ సినిమాను మీకు డెడికేట్‌ చేస్తున్నా. ఆగస్టు 25న ఇండియా షేక్‌ అవ్వడం గ్యారెంటీ!' అంటూ ఫ్యాన్స్‌కి కిక్‌ ఇచ్చే రేంజ్‌లో విజయ్‌ మాట్లాడాడు.

ఇక ఇండియాలో నెక్స్ట్ బిగ్ థింగ్ విజయ్ దేవరకొండ అంటూ పూరి జగన్నాథ్‌ మరింత హైప్‌ క్రియేట్‌ చేశారు. ఈ కార్యక్రమంలో బాలీవుడ్‌ ఫిల్మ్‌ మేకర్‌ కరణ్‌ జోహార్‌, అనిల్‌ తడానీ, అనన్య పాండే, చార్మీ సహా పలువురు పాల్గొన్నారు. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు