Vijay Devarakonda: లైగర్‌ ఫ్లాప్‌తో బాధలో విజయ్‌, కాలర్‌ ఎగరేసే రోజులొస్తాయంటున్న ఫ్యాన్స్‌

26 Aug, 2022 18:50 IST|Sakshi

రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన పాన్‌ ఇండియా చిత్రం లైగర్‌. భారీ అంచనాల మధ్య గురువారం విడుదలైన ఈ మూవీ నెగెటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. దీంతో సినిమాపై భారీగా ట్రోల్స్‌ జరుగుతున్నాయి. ఈ క్రమంలో హీరో విజయ్‌ థియేటర్‌లో సినిమా చూసి బాధతో తిరిగి వెళ్తున్న వీడియో వైరల్‌గా మారింది. ఇది చూసిన రౌడీ ఫ్యాన్స్‌ మనసు చివుక్కుమంది.

'ఈ సినిమా కోసం బాడీని మార్చుకునేందుకు ఎన్నో కసరత్తులు చేశావు. యాక్టింగ్‌ చించేశావ్‌. సినిమాలో ఎక్కడా నీ జోష్‌ తగ్గలేదు. కానీ మంచి కథను సెలక్ట్‌ చేసుకోవడంలోనే తడబడ్డావు', 'అన్నా, నువ్వు బాధపడకు.. ఇప్పుడు నిన్ను విమర్శించిన నోళ్లే రేపు నీకు చప్పట్లు కొడతారు', 'మేము కాలర్‌ ఎగరేసేలా నీకు మంచి రోజులు వస్తాయ్‌' అంటూ నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

చదవండి: సినిమా ఛాన్సులు రావేమోనని క్యాన్సర్‌ ఉందని చెప్పలేదు
ఈ ఫొటోలో ఉన్న నటుడిని గుర్తుపట్టారా?

మరిన్ని వార్తలు