గోవా బీచ్‌లో యంగ్‌ హీరోయిన్‌తో విజయ్‌.. ఫోటో వైరల్‌

13 Jul, 2021 14:16 IST|Sakshi

విజయ్‌ దేవరకొండకు ఉన్న ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘అర్జున్‌ రెడ్డి’ మూవీతో ఒక్కసారిగా ఇండస్ట్రీలో ఎంతో క్రేజ్‌ సంపాదించుకున్న విజయ్‌ టాలీవుడ్‌ నుంచి బాలీవుడ్‌ వరకు ఎంతోమంది ఫ్యాన్స్‌ను సంపాదించుకున్నాడు. సినిమాల్లో విజయ్ హీరోయిజానికి ఎంత మంది అభిమానులో.. బయట అతడి యాటిట్యూడ్‌కి అంతే రేంజ్‌లో ఫాలోవర్లు కూడా ఉన్నారు. ఈ రౌడీ స్టైల్‌కి పలువురు స్టార్‌ హీరోయిన్లు సైతం ఫిదా అవుతుంటారు.

ఇప్పటికే సారా అలీఖాన్‌, శ్రద్ధా, జాన్వీకపూర్‌లు విజయ్‌ తమ ఫేవరెట్‌ అని హీరోయిన్‌ అని స్టేట్‌మెంట్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ లిస్టులో బాలీవుడ్‌ బ్యూటీ కియారా కూడా చేరిపోయినట్లుంది. రీసెంట్‌గా విజయ్ దేవరకొండపై తన ఇష్టాన్ని తెలిపింది కియారా. ఈ నేపథ్యంలో వీరిద్దరు కలిసి దిగిన ఓ పిక్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. గోవా బీచ్‌లో ఎంజాయ్‌ చేస్తున్న విజయ్‌-కియారాల ఫోటోలు ప్రస్తుతం నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి. అయితే ఈ ఫోటో ఎప్పుడు తీసుకున్నారా అన్నదానిపై క్లారిటీ లేదు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం విజయ్‌ పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో  లైగర్‌ అనే పాన్‌ఇండియా మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు