విజయ్‌ చేతుల మీదుగా రౌడీబాయ్స్‌ సెకండ్‌ సాంగ్‌

21 Oct, 2021 10:19 IST|Sakshi

ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు సోదరుడు శిరీష్‌ తనయుడు ఆశిష్‌ హీరోగా నటించిన చిత్రం ‘రౌడీబాయ్స్‌’. అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్‌. శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని దిల్‌రాజు, శిరీష్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ఫస్ట్‌లుక్‌, మోషన్‌ పోస్టర్‌, ఫస్ట్‌సాంగ్‌కు మంచి రెస్పాన్స్‌ వస్తోంది.  ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుంచి రెండో పాట విడుదలైంది. ‘ప్రేమ ఆకాశమైతే...’ అంటూ సాగే ఈ పాటే యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ విడుదల చేశాడు. శ్రీమణి  రాసిన ఈ పాటకు దేవిశ్రీప్రసాద్‌ స్వరాలు సమకుర్చగా జస్‌ప్రీత్‌ జస్జ్‌ ఆలపించారు.

చదవండి: ఆ సినిమాలో సాయి పల్లవిపై స్పెషల్‌ సాంగ్‌, ఈసారి క్లాసికల్‌ టచ్‌తో..!

ఈ పాట విడుదల అనంతరం విజయ్‌ మాట్లాడుతూ.. ‘‘హర్ష, నేను ఇండస్ట్రీలోకి రావాలని కలలు కనేవాళ్ళం. హర్షకు కాలేజ్‌ మీటర్‌ బాగా తెలుసు. హర్ష దర్శకత్వం వహించిన మొదటి సినిమా ‘హుషారు’ కంటే ఈ సినిమా ఇంకా పెద్ద విజయం సాధించాలని ఆశిస్తు‍న్నా. ఇక తొలి సినిమా ఎక్స్‌పీరియన్స్‌ను ఆశిష్‌ ఫుల్‌గా ఎంజాయ్‌ చేయాలని కోరుకుంటున్నాను. నాకు ‘పెళ్ళి చూపులు’ స్ట్రాంగ్‌గా గుర్తుండిపోయింది. ఆశిష్‌లో నాకో సిన్సియారిటీ కనిపిస్తుంది. ‘రౌడీ బాయ్స్‌’ స్టార్ట్‌ కావడానికి ముందు ఓసారి నన్ను కలిశాడు. అతనిలో నటన పట్ల ఆసక్తి, తపన కనిపించాయి. ఆశిష్‌... మీ నాన్న (శిరీష్‌), బాబాయ్‌ (‘దిల్‌’ రాజు) చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చారు. నువ్వు.. వారు గర్వపడేలా చేస్తావని ఆశిస్తున్నాను’’ అన్నారు. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

చదవండి: ప్రభాస్‌ బర్త్‌డే: రాధే శ్యామ్‌ నుంచి రానున్న బిగ్‌ సర్‌ప్రైజ్‌

మరిన్ని వార్తలు