Liger Movie: ఆసక్తిరేపుతున్న క్లైమాక్స్‌ సీన్‌ అప్‌డేట్‌!

9 Jun, 2021 13:34 IST|Sakshi

మాస్‌ కమర్షియల్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌, విజయ్‌ దేవరకొండ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘లైగర్‌’. ఇందులో విజయ్‌కి జోడీగా బాలీవుడ్‌ బ్యూటీ అనన్య పాండే నటిస్తుంది. ఈ చిత్రంలో విజయ్‌ సరికొత్త లుక్‌తో ప్రేక్షకులను అలరించనున్నాడు. లైగర్‌ కోసం ఈ ‘రౌడీ’  పూర్తిగా తన లుక్‌ను మేకోవర్‌ చేసుకున్నాడు. విజయ్‌ ఈ కొత్త లుక్‌కు సూపర్‌ రెస్పాన్స్‌ రాగా ఈ చిత్రంపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఇదిలా ఉండగా ఈ చిత్రాన్ని ప్రకటించినప్పటి నుంచి దీనికి సంబంధించిన పలు వార్తలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో లైగర్‌ నుంచి మరో క్రేజీ అప్‌డేట్‌ బయటకు వచ్చింది.

ప్రస్తుతం చివరి షూటింగ్‌ షెడ్యూల్‌ను జరుపుకుంటున్న ఈ మూవీ క్లైమాక్స్‌ సన్నివేశానికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం హల్‌చల్‌ చేస్తోంది. తాజా బజ్‌ ప్రకారం.. ఈ సినిమా మొత్తానికి క్లైమాక్స్ సీన్ హైలెట్‏గా నిలువనుందట. దాదాపు పదిహేను నిమిషాల పాటు ఈ సన్నివేశం ఉండనున్నట్లు వినికిడి. ఎమోషనల్‌గా సాగే ఈ క్లైమాక్స్‌ సన్నివేశంలో యాక్షన్‌తో పాటు ఊహించని ట్వీస్ట్స్‌ ప్రేక్షకులకు థ్రిల్‌ను అందించనుందని టాక్‌. ఇక ఈ కీలకమైన యాక్షన్ సీన్‌లో రియల్ ఇంటర్ నేషనల్ బాక్సర్ నటించబోతున్నట్లుగా సమాచారం. కాగా ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ బ్యానర్లపై కరణ్ జోహార్, పూరీ జగన్నాథ్, ఛార్మిలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ 9న దేశవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాతో అనన్య టాలీవుడ్‌కు పరిచయం కానుంది. 

చదవండి: 
అదీ విజయ్‌ క్రేజ్‌! ఆలిండియాలో సెకండ్‌ ప్లేస్‌
విజయ్‌ దూకుడు.. తన ప్రొడక్షన్‌లో మరో రెండు సినిమాలు

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు