‘లైగర్‌’ ఫస్ట్‌లుక్‌ అరుదైన రికార్డు, సౌత్‌లోనే తొలి చిత్రంగా..

19 Jun, 2021 19:51 IST|Sakshi

విజయ్‌ దేవరకొండ తాజా చిత్రం ‘లైగర్‌’ ఫస్ట్‌ లుక్‌ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. సోషల్‌ మీడియాలో అత్యధిక లైక్‌లు రాబట్టుకుని దక్షిణాది చిత్రాల్లో తొలి ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌గా నిలిచింది. ఈ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 2 మిలియన్లకు పైగా లైక్స్‌ను సాధించి రికార్డు సృష్టించింది. కాగా ఇప్పటికే ఈ మూవీలో విజయ్‌ సరికొత్త లుక్‌కు సూపర్‌ రెస్పాన్స్‌ వస్తోన్న సంగతి తెలిసిందే. ‘లైగర్‌’ కోసం విజయ్‌ పూర్తిగా తన లుక్‌ను మేకోవర్‌ చేసుకున్నాడు. 

మాస్‌ కమర్షియల్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీని బాలీవుడ్‌ నిర్మాత కరణ్‌ జోహర్‌ ధర్మ ప్రొడక్షన్‌, పూరి కనెక్ట్స్ బ్యానర్లపై కరణ్ జోహార్, పూరీ జగన్నాథ్, ఛార్మిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చివరి షూటింగ్‌ షెడ్యూల్‌ను జరుపుకుంటున్న ‘లైగర్‌’ మూవీ సెప్టెంబర్ 9న దేశవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాతో అనన్య టాలీవుడ్‌కు పరిచయం కానుంది.  

చదవండి: 
Liger Movie: ఆసక్తిరేపుతున్న క్లైమాక్స్‌ సీన్‌ అప్‌డేట్‌! 

మరిన్ని వార్తలు