పులి, సింహం కలిస్తే అది విజయ్‌!

18 Jan, 2021 10:25 IST|Sakshi

రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ ప్రధాన పాత్రలో, బాలీవుడ్‌ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. 'ఫైటర్'‌ అనే వర్కింగ్‌ టైటిల్‌తో రూపు దిద్దుకుంటున్న ఈ సినిమాకు పూరీ జగన్నాథ్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. పూరీ, చార్మీ, కరణ్‌ జోహార్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ముందుగా చెప్పినట్లుగానే చిత్రయూనిట్‌ సోమవారం ఉదయం పది గంటలకు సినిమా టైటిల్‌ను రివీల్‌ చేయడంతో పాటు ఫస్ట్‌ లుక్‌ను రిలీజ్‌ చేసింది. ఎంతో భిన్నంగా "లైగర్" అనే టైటిల్‌ను ఖరారు చేసింది. సాలా క్రాస్‌బ్రీడ్‌ అనేది ఉపశీర్షిక. ఈ చిత్రం కోసం థాయ్‌లాండ్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకున్న విజయ్‌ కష్టం పోస్టర్‌లో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. బ్యాక్‌గ్రౌండ్‌లో లైగర్‌ ఫొటో దాని ముందు పంచులు కురిపించేందుకు సిద్ధంగా ఉన్న బాక్సర్‌ విజయ్‌ ఫొటో అభిమానులను ఆకర్షిస్తోంది. కాగా లైగర్‌ అంటే మగ సింహం, ఆడ పులిల సంతానం. ఇవి సింహం, పులి కన్నా చాలా పెద్దగా ఉంటాయి. ఇవి సింహాల్లానే గర్జిస్తాయి. (చదవండి: దుబాయ్‌కి వెళ్తున్న మహేశ్‌.. 20 రోజులు అక్కడే!)

ఇదిలా వుంటే.. వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ డిజాస్టర్‌ కావడంతో ఈసారి ఎలాగైనా హిట్టు కొట్టాలన్న కసి మీదున్నాడు రౌడీ. అందుకే మళ్లీ పూర్తిస్థాయిలో ప్రేమ కథల జోలికి వెళ్లకుండా కొంత వినూత్నంగా లైగర్‌తో స్పోర్ట్స్ బ్యాగ్రౌండ్‌ కథను ఎంచుకున్నాడు. దీని తర్వాత ‘నిన్ను కోరి’, ‘మజిలీ’ ఫేమ్‌ శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. దిల్‌ రాజు నిర్మించనున్న ఈ సినిమా చిత్రీకరణ వేసవిలో ప్రారంభం కానుంది. ఆ తర్వాత సుకుమార్‌ డైరెక్షన్‌లో మరో చిత్రం చేయనున్నాడు. 2022లో ఈ సినిమా సెట్స్‌ మీదకు వెళ్తుందని గతంలోనే ప్రకటించారు. ఇండియా-పాకిస్తాన్‌ యుద్ధం నేపథ్యంలో ఈ సినిమా కథ నడుస్తుందని టాక్‌. అంటే ఇందులో విజయ్‌ సైనికుడిగా కనిపించనున్నాడన్నమాట. (చదవండి:ఇన్‌స్టాలో విజయదేవరకొండ రికార్డు)

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు