'సర్కారు వారి పాట', లైగర్‌ రిలీజ్‌ డేట్‌లు ఒకేరోజు?

30 Nov, 2021 08:04 IST|Sakshi

Vijay Devarakonda Liger Movie Going To Release On Ugadhi: లాస్‌ వేగాస్‌ నుంచి లాస్‌ ఏంజిల్స్‌కు షిఫ్ట్‌ అయింది ‘లైగర్‌’ టీమ్‌. విజయ్‌ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘లైగర్‌’. ఇందులో విజయ్‌ దేవరకొండ బాక్సర్‌గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ లాస్‌ ఏంజిల్స్‌లో జరుగుతోంది. విజయ్‌ దేవరకొండ, మైక్‌ టైసన్‌లపై లాస్‌ వేగాస్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరించిన తర్వాత తదుపరి చిత్రీకరణ కోసం ‘లైగర్‌’ యూనిట్‌ లాస్‌ ఏంజిల్స్‌కి వెళ్లింది.

ఈ ఏడాది సెప్టెంబరు 9న విడుదల కావాల్సిన ఈ చిత్రం విడుదల కరోనా పరిస్థితుల కారణంగా వాయిదా పడింది. కానీ వచ్చే ఏడాది ఉగాది సందర్భంగా ఏప్రిల్‌ 1న విడుదల చేసే సాధ్యాసాధ్యాలను నిర్మాతలు ఆలోచిస్తున్నారని ఫిల్మ్‌నగర్‌ తాజా టాక్‌. మరోవైపు మహేశ్‌బాబు హీరోగా పరశురామ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘సర్కారువారి పాట’ చిత్రం ఏప్రిల్‌ 1న రిలీజ్‌ ఫిక్స్‌ చేసుకున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు