రివర్స్‌ గేర్‌లో వచ్చి.. స్టార్స్‌ అయ్యారు

12 Oct, 2022 10:59 IST|Sakshi

హీరో కావాలంటే ఏం కావాలి ? టాలెంట్. ఎవరినడిగినా ఇదే ఆన్సర్ వస్తుంది. మరి…ఒక్క టాలెంట్ ఉంటే సరిపోతుందా ? ఈ ప్రశ్నకు మాత్రం వెంటనే జవాబు రాదు.నిజమే కదా…నెపోటిజం నుంచి మొదలుపెడితే సవాలక్ష అడ్డంకులను అధిగమించాలి. ఎలాంటి బ్యాగ్రౌండ్‌ లేకుండా, గాడ్ ఫాదర్లు లేకుండా, కేవలం టాలెంట్ పెట్టుకుని వెండితెర మీద వెలిగిపోవడం అంత తేలికేం కాదు. ఆఫీస్ల చుట్టూ తిరగాలి. ఇండస్ట్రీలో వాళ్లనీ, వీళ్లనీ ఇంప్రెస్ చేయాలి. గంటల పాటు స్టూడియోల ముందు, షూటింగ్ స్పాట్ల ముందు వెయిట్ చేయాలి. అయినా ప్రతిఫలం ఉంటుందో, ఉండదో క్లారిటీ ఉండదు. మరేం చేయాలి ? ఇంకేముంది. రివర్స్ గేర్ వేయాలి. టైమ్ వేస్ట్ చేయకుండా…షార్ట్ ఫిల్మ్స్ పై ఫోకస్ పెట్టడమే. ముందు ప్రేక్షకులకు దగ్గర కావడమే. వాళ్ల మెప్పు పొందితే…ఇండస్ట్రీ నుంచే పిలుపొస్తుంది. వీళ్లు రివర్స్ గేర్లో వచ్చారు. ముందు ప్రేక్షకుల మెప్పు పొందేశారు. ఆ తర్వాత సినిమా చాన్సులు సంపాదించారు. 

అర్జున్ రెడ్డితో విజయ్ దేవరకొండ కలిగించిన సంచలనం టాలీవుడ్‌ దాటి బాలీవుడ్ దాక వెళ్లిపోయింది. మరి దానికి ముందు విజయ్ దేవరకొండ ఏంటి అనగానే పెళ్లి చూపులు సినిమా గుర్తొస్తుంది. దానికి ముందు అని మళ్లీ ప్రశ్నిస్తే లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, నువ్విలా అన్న ఆన్సర్ వినిపిస్తుంది. కానీ…షార్ట్  ఫిల్మ్స్‌తోనే ఇండస్ట్రీ దృష్టిలో పడ్డాడు విజయ్. 2011లో కొంచెం టచ్‌లో ఉంటా అనే షార్ట్ షార్ట్‌ ఫిల్మ్‌ మొదలైన ప్రయాణం…అతన్ని టాలీవుడ్ స్టార్‌ని చేసింది.

(చదవండి: తరుణ్‌ స్పీచ్‌.. కన్నీళ్లు పెట్టుకున్న త్రివిక్రమ్‌)

సుహాస్.. కలర్ ఫోటో మూవీ హీరో. కథానాయకుడు అంటే ఇలానే ఉండాలి అన్న అడ్డుగోడ లను బద్దలుకొట్టిన హీరో. షార్ట్ ఫిల్మ్స్‌తోనే ఇండస్ట్రీ దృష్టిలో పడ్డాడు. తన నటించిన చాలా షార్ట్ ఫిల్మ్స్ సోషల్ మీడియాలో హిట్ అయ్యాయి. 

షార్ట్ ఫిల్మ్స్‌తో క్లిక్ అయ్యాడు. ఆ తర్వాత చిన్న చిన్న క్యారెక్టర్లు నుంచి హీరో ఫ్రెండ్‌గా సుహాస్ జర్నీ వేగంగానే సాగింది. ప్రతి రోజు పండుగ, మజిలీ చిత్రాల్లో ముఖ్య పాత్రలతో ప్రేక్షకులకు మరింతగా దగ్గరైయ్యాడు. హీరో ఫ్రెండ్‌గా ఇటు కామెడీని పండిస్తూ, అదే సమయంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఉనికిని చాటు కుంటోన్న సుహాస్‌ని…కలర్ ఫోటో హీరో చేసేసింది. ఇండస్ట్రీకి కొత్త స్టార్ దొరికేశాడు. ఆరు పాట లు, ఐదు ఫైట్స్ తరహా మూస సినిమాలని బ్రేక్ చేయాలని ప్రయ త్నించే దర్శకులకు సుహాస్ ఇప్పుడు బిగ్ స్టార్. 

నవీన్ పొలిశెట్టి. ముంబై బేస్డ్ కామెడీ కంపెనీ  ఏఐబీ(A.I.B)లో చాలా వీడియోలు చేశారు. అందులో ఇంజినీరింగ్ గురించి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ గురించి చేసిన వీడియో… సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. నేషనల్ వైడ్ నవీన్ పొలిశెట్టికి పావులారిటీ తెచ్చింది. నిజానికి లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ నుంచి అనేక సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ వేస్తూ వచ్చా డు నవీన్. కానీ…A.I.B వీడియోస్ క్లిక్ అయ్యేదాకా పెద్దగా సినీ అవకాశాలు రాలేదు. ఇంజినీరింగ్ వీడియో క్లిక్ అయిన తర్వాత…హీరోగా ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ లాంటి హిట్ ఇచ్చాడు నవీన్. ఆ తర్వాత జాతిరత్నాలు  లాంటి మరో హిట్ మూవీతో స్టార్ అయిపోయాడు.

మరిన్ని వార్తలు