విజయ్‌ దూకుడు.. తన ప్రొడక్షన్‌లో మరో రెండు సినిమాలు

31 May, 2021 21:13 IST|Sakshi

సాధారణంగా హీరోలు నిర్మాతలుగా మారడానికి కొంత సమయం తీసుకుంటారు. ఎందుకంటే సినిమాను నిర్మించడం అనేది సాధారణ విషయం కాదు. దాన్ని నిర్మించడం ఒక ఎత్తెయితే, దానిని బిజినెస్ చేయడం మరో ఎత్తు. అందుకే సినిమాలను నిర్మించడంతో ఎవరైనా ఆచితూచి అడుగేస్తుంటారు. కానీ ఈ విషయంలో విజయ్ దేవరకొండ తనదైన దూకుడు చూపిస్తున్నాడు. విజయ్‌ సొంతంగా ‘కింగ్ ఆఫ్ ది హిల్’ పేరుతో బ్యాన‌ర్ స్టార్ట్ చేసి ఇప్పటికే ‘మీకు మాత్రమే చెప్తా’ మూవీని నిర్మించాడు.

ఇందులో విజయ్‌ పెళ్లి చూపులు సినిమా ద‌ర్శ‌కుడు ప్ర‌ధాన పాత్ర పోషించాడు. తాజాగా తన ప్రొడక్షన్‌ మరో మూవీని నిర్మించేందుకు సిద్దమయ్యాడు విజయ్‌. తన సోదరుడు ఆనందర్‌ దేవరకొండ హీరోగా ‘పుష్పక విమానం’ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమాతో దర్శకుడిగా దామోదర పరిచయమవుతున్నాడు. అలాగే ఈ మూవీతో పాటు మరో చిత్రాన్ని కూడా విజయ్‌ నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. పృథ్వీసేన దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాలో కొత్త వారికి అవకాశం ఇస్తు మొత్తం నూతన నటీనటులతో ఈ మూవీని రూపొందిస్తున్నారట. త్వరలోనే ఈ సినిమా కూడా రెగ్యులర్ షూటింగు ప్రారంభించాలని చూస్తున్నట్లు విడికిడి. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు