విజయ్‌ సరికొత్త రికార్డు, సౌత్‌లోనే నెంబర్‌ 1

19 May, 2021 19:36 IST|Sakshi

టాలీవుడ్‌ క్రేజీ స్టార్‌ ఎవరంటే టక్కున గుర్తొచ్చే పేరు విజయ్‌ దేవరకొండ. అతడికి పరిశ్రమలో ఉన్న ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ‘అర్జున్‌ రెడ్డి’ మూవీతో ఒక్కసారిగా ఇండస్ట్రీలో ఎంతో క్రేజ్‌ సంపాదించుకున్న విజయ్‌ టాలీవుడ్‌ నుంచి బాలీవుడ్‌ వరకు ఎంతోమంది ఫ్యాన్స్‌ను సంపాదించుకున్నాడు. ఇక ఈ ‘రౌడీ’ సోషల్ మీడియాలో చేసే సందడి అంతా ఇంతా కాదు. సినిమాల్లో విజయ్ హీరోయిజానికి ఎంత మంది అభిమానులో.. బయట అతడి యాటిట్యూడ్, వ్యక్తిత్వానికి అంతే రేంజ్‌లో ఫాలోవర్లు కూడా ఉన్నారు. అలా సోషల్ మీడియాలో రోజురోజుకూ తన క్రేజ్‌ను పెంచుకుంటున్న విజయ్‌ ఇప్పుడు సరికొత్త రికార్డును క్రియేట్‌ చేశాడు.

దక్షిణాది స్టార్‌ హీరోలకంటే ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్స్‌తో విజయ్‌ ముందంజలో ఉన్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో 12 మిలియన్ల ఫాలోవర్స్‌తో విజయ్ సౌత్‌ హీరోల్లో నెంబర్ వన్ హీరోగా మారిపోయాడు. మిగతా హీరోలు అల్లు అర్జున్ (11.8), మహేష్ బాబు (6.7), ప్రభాస్ (6.5), రామ్ చరణ్ (3.9), ఎన్టీఆర్ (2.6)కు ‍కన్నడ స్టార్‌ హీరోలైన యశ్‌(5), డీబీ బాస్‌ దర్శన్‌కు(941k) మిలియన్ల ఫాలోవర్స్‌ ఉండగా వీళ్లందరిని వెనక్కి విజయ్‌ 12 మిలియన్ల ఫాలోవర్స్‌తో నెంబర్‌ వన్‌ స్థానానికి ఎదిగాడు. 

కాగా ప్రస్తుతం విజయ్‌.. పూరీ జగన్నాథ్‌తో పాన్ ఇండియా మూవీ ‘లైగర్' చేస్తున్నాడు. వినాయక చవితి కానుకగా ఈ మూవీ సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ఇప్పటికే చిత్ర యూనిట్  ప్రకటించింది. అయితే కరోనా కారణంగా మూవీ ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు