Kushi Movie OTT Release Date: ఓటీటీలోకి ‘ఖుషి’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడు? ఎక్కడ?

24 Sep, 2023 10:00 IST|Sakshi

విజయ దేవరకొండ, సమంత జంటగా నటించిన రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఖుషి’. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్‌ 1న విడుదలై మంచి ఓపెనింగ్స్‌ని అందుకుంది. విజయ్‌, సామ్‌ల ఆన్‌స్క్రీన్‌ కెమిస్ట్రీకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అద్భుతమైన విజువల్స్‌కి తోడు మంచి పాటలు, అదిరిపోయే బీజీఎం సినిమా విజయంలో కీలక పాత్రలు పోషించాయి. ఇన్నాళ్లు థియేటర్స్‌లో అలరించిన ఈ చిత్రం..ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమైంది. 

భారీ ధరకు డిజిటల్‌ రైట్స్‌
సామ్‌, విజయ్‌ కలిసి నటించిన ఖుషి సినిమాపై మొదటి నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రిరిలీజ్‌ బిజినెస్‌ కూడా భారీగానే జరిగింది. ముఖ్యంగా డిజిటల్‌ రైట్స్‌ కోసం పలు ఓటీటీ సంస్థలు పోటీ పడ్డాయట. చివరకు ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ కళ్లు చెదిరే ధరకు కొనుగోలు చేసింది. 

ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌
సెప్టెంబర్‌ 1న పాన్‌ ఇండియా వైడ్‌గా రిలీజ్‌ అయిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. థియేటర్స్‌లో విడుదలైన నెల రోజుల తర్వాత ఈ చిత్రం ఓటీటీలో రిలీజ్‌ కాబోతుంది. అక్టోబర్‌ 1 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కాబోతున్నట్లు ఒటీటీ దిగ్గజం ప్రకటించింది. ఓటీటీ రిలీజ్‌పై పలు రూమర్స్‌ వస్తున్న నేపథ్యంలో నెటిఫ్లిక్స్‌ ఈ ప్రకటన చేసింది. ఇందులో నిడివి కారణంగా కట్‌ చేసిన కొన్ని సన్నివేశాలను కూడా యాడ్‌ చేశారట. ముఖ్యంగా విజయ్‌, సామ్‌లకు లంభించిన కొన్ని రొమాంటిక్‌ సీన్స్‌ ఇందులో చూపించబోన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 

మరిన్ని వార్తలు