Vijay Devarakonda: 'తెలంగాణ , ఆంధ్ర షేక్ చేస్తే ఇండియా మొత్తం వినిపించాలి'

15 Aug, 2022 10:28 IST|Sakshi

పాన్ ఇండియా స్టార్ విజయ్ దేవరకొండ, పాత్ బ్రేకింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ల క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్  ''లైగర్''(సాలా క్రాస్బ్రీడ్) ఆగస్ట్ 25న విడుదల అవుతుంది. ది గ్రేట్ మైక్ టైసన్ లైగర్ సినిమాతో ఇండియన్ సినిమాలో అరంగేట్రం చేస్తున్నారు. పూరి కనెక్ట్స్, బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా సంయుక్తంగా సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన లైగర్  ట్రైలర్, పాటలు ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా అంచనాలను పెంచాయి. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ , మలయాళం భాషల్లో ఆగస్ట్ 25న లైగర్ ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో  'లైగర్’ ఫ్యాన్డమ్ టూర్ ని వరంగల్-హన్మకొండ కాజీపేటలోని సత్యసాయి కన్వెన్షన్లో గ్రాండ్ గా నిర్వహించింది చిత్ర యూనిట్. 

ఈ వేడుకలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా వున్న తెలుగు ప్రేక్షకులందరికీ నా ప్రేమ. ఇండియా అంతా తిరిగి ఇక్కడికి వచ్చాం. కానీ ఎక్కడ తిరుగుతున్నా ఇక్కడి గురించే ఆలోచన. లైగర్ గురించి ఇక్కడ ఏమనుకుంటున్నారనే ఆలోచన. వరంగల్ ఆర్ట్స్ కాలేజీలో పెద్ద ఈవెంట్ చేయాలని అనుకున్నాం. వర్షం వలన కుదరలేదు. కానీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ గారి ప్రోత్సాహం వలన ఈ ఈవెంట్ ఇక్కడ ఇంత గ్రాండ్ గా జరిగింది. నేను ఇండియాలో ఎక్కడి వెళ్ళిన జనాలు అమితమైన ప్రేమని పంచారు. ఊహించని రీతిలో జనాలు వచ్చారు. అసలు ఇంత ప్రేమ ఎందుకు చుపిస్తున్నారో అర్దమయ్యేది కాదు. అయితే ఏం జరుగుతున్నా అది ఇక్కడే మొదలైయింది. మన కాలేజ్ లో , మన థియేటర్ లో మన ఆంధ్ర తెలంగాణలో ఇది మొదలైయింది. మీరు పంచిన ప్రేమని మర్చిపోలేను.

ఆగస్ట్ 25న మీ ప్రేమని తిరిగివ్వాలి. ఆగస్ట్ 25 ఆగ్ లాగా దేంగే అని వరంగల్ లోనే చెప్పాను. సినిమాపై ఎలాంటి డౌట్ లేదు. సినిమా బ్లాక్ బస్టర్. తెలంగాణ , ఆంధ్ర షేక్ చేస్తే ఇండియా మొత్తం వినిపించాలి. లైగర్ లో అమ్మా కొడుకు కరీంనగర్ నుండి బయలుదేరి కొడుకుని ఛాంపియన్ చేయాలని ముంబై వెళ్తారు. పూరి మా నాన్న, ఛార్మీ మా అమ్మలాగ ఇండియాని షేక్ చేద్దామని ముంబై వెళ్లాం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా కొట్టాలనే బయలుదేరాం. పూరి గారు రాసిన డైలాగ్ చెప్పాలంటే అదృష్టం వుండాలి. లైగర్ లో నాకు నచ్చిన డైలాగ్.. వి ఆర్ ఇండియన్స్.. పోదాం, కొట్లాడదాం.. ఆగ్ హే అందర్. దునియా కో ఆగ్ లగా దేంగే. సబ్ కి వాట్ లాగా దేంగే. ఆగస్ట్ 25న మనమందరం కలసి గట్టిగా కొట్టాలి. లైగర్ టీం అందరికీ థాంక్స్. ప్రేక్షకులందరికీ థాంక్స్. ఐ లవ్ యూ'' అన్నారు. 

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ మాట్లాడుతూ.. వరంగల్ పై ప్రేమతో లైగర్ టీం ఇక్కడికి వచ్చింది. విజయ్ దేవరకొండ 25న దుమ్మురేపాలి. పూరి జగన్నాధ్, ఛార్మీ ఇక్కడ స్టూడియో పెట్టాలని కోరుతున్నా. కేసీఆర్, కేటీఆర్ గారితో మాట్లాడి లాండ్ ఇప్పించే భాద్యత నాది.  విజయ్ దేవరకొండ నాకు బాగా దగ్గర బంధవు. నా పిలుపుతో ఇక్కడి వచ్చారు. వరంగల్ లో మొదలుపెట్టిన ఈ చిత్రం వందశాతం విజయం సాధిస్తుంది'' అన్నారు. 

అనన్య పాండే మాట్లాడుతూ... నా పేరు అనన్య పాండే. తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. తెలుగు ప్రేక్షకులంటే నాకు చాలా ఇష్టం. తెలుగు సినిమా కుటుంబం భాగం కావాలని కోరుకుంటున్నాను. ఆ అవకాశం ఇస్తారని కోరుకుంటున్నాను. లైగర్ తో తెలుగులో ఎంట్రీ ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్నా. విజయ్ దేవరకొండ, పూరి గారు, మైక్ టైసన్ గారితో పని చేయడం చాలా ఆనందంగా వుంది. విజయ్ దేవరకొండ నా బుజ్జి కన్నా. ఆగస్ట్ 25న లైగర్ సినిమా థియేటర్ లో పగిలిపోద్ది.  లైగర్ ఫుల్ మాస్ కమర్షియల్ సినిమా. దింపుతున్నాం. మజా వస్తది'' అన్నారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు