రష్మికకు ప్రపోజ్‌ చేసిన రౌడీ హీరో.. వీడియో వైరల్‌

20 Apr, 2021 17:17 IST|Sakshi

రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ, కన్నడ బ్యూటీ రష్మికల కెమిస్ట్రీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘గీతా గోవిందం’ నుంచి వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. ‘డియర్‌ కామ్రేడ్‌’ సినిమాతో ఆ స్నేహం మరింత బలపడింది. ఒకనొక దశలో వీరిద్దరి మధ్య ప్రేమాయాణం నడుస్తుందనే పుకార్లు కూడా వచ్చాయి. అయితే తమ మధ్య ప్రేమ, దోమ ఏదీ లేదని, ఫ్యామిలీ ప్రెండ్స్‌ మాత్రమేనని క్లారిటీ ఇచ్చారు.

‘గీతా గోవిందం’, డియర్‌ కామ్రేడ్‌ సినిమాల్లోనూ వీరిద్దరి ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీకి ఆడియెన్స్‌ ఫిదా అయ్యారు. ఈ కాంబినేషన్‌ నుంచి మరో సినిమా రావాలని అభిమానులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. తాజాగా ఫ్యాన్స్‌ కోరిక నెరవేరింది. అయితే అది సినిమా రూపంలో కాకుండా యాడ్‌ రూపంలో నెరవేరింది. సంతూర్‌ సోప్‌ యాడ్‌లో ఈ జంట కలిసి నటించింది. ఇప్పటికే ముంబైలో యాడ్ షూట్ పూర్తి అయింది. త్వరలో టెలికాస్ట్ కాబోయే ఈ కమర్షియల్ యాడ్‌లో విజయ్, రష్మికకు ప్రపోజ్‌ చేశాడు. విజయ్‌ మోకాళ్లపై కూర్చుని గిఫ్ట్ ఇస్తూ రష్మికకు ప్రపోజ్‌ చేశాడు. ఇందుకు సంబంధించిన పిక్స్, వీడియో నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘లైగర్’ లో నటిస్తున్నాడు. ఇందులో అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది.  అల్లు అర్జున్‌, సుకుమార్‌ కాంబోలో వస్తున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘పుష్ప’లో హీరోయిన్‌గా నటిస్తోంది రష్మిక. అలాగే ఓ బాలీవుడ్‌ సినిమాలో కూడా నటిస్తోంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు