దివాళి స్పెషల్‌ : వీర జవాన్లతో విజయ్‌ దేవరకొండ

24 Oct, 2022 12:57 IST|Sakshi

దేశ స‌రిహ‌ద్దులో డ్యూటీ చేస్తున్న వారిని కలిసి వారితో కొంత సమయాన్ని గడిపారు టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ. ఎన్‌డిటివి ఛాన‌ల్ ప్ర‌త్యేకంగా విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో జై జవాన్ అనే ఓ కార్య‌క్ర‌మం చేపట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలు ప్రోమోలతో ఈ కార్యక్రమం పై మంచి అసక్తి ఏర్పరచగా దీపావళి సందర్భంగా ఈ కార్యక్రమం ఫుల్ ఎపిసోడ్ విడుదల అయ్యింది.

ఈ ఎపిసోడ్ లో ఉరి బోర్డర్లో డ్యూటీ చేస్తున్న జ‌వాన్‌ ల‌ను క‌లిసి వారి విధి విధానాలు, డ్యూటీలో వున్న వారి సాధ‌క‌బాధ‌ల‌ను తెలుసుకున్నారు విజయ్ దేవరకొండ. వారితో కలిసి కొన్ని యుద్ధ మెళకువలు నేర్చుకున్నారు. ఫైరింగ్ ఎలా చేయాలో, బోటింగ్ ఎలా చేయాలో అన్న విషయాలను ఆయన నేర్చుకున్నారు.

అంతేకాదు వారితో సరదాగా ఆటలాడుతూ వారిని ఉల్లాస పరిచారు. చివరిగా జవాన్ లతో కలిసి చిందులు వేశారు విజయ్ దేవరకొండ. ఆయన నటించిన లైగర్ సినిమాలోని డైలాగ్ ను చెప్పి అందరిలో నూతనోత్తేజాన్ని నింపారు. 

మరిన్ని వార్తలు