విజయ్‌ దేవరకొండ సినిమా డేట్‌ ఫిక్స్‌

12 Feb, 2021 00:58 IST|Sakshi

‘లైగర్‌’ విడుదల తేదీ ఖరారైంది. ఈ ఏడాది సెప్టెంబరు 9న ఈ చిత్రం విడుదల కానుంది. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ హీరోగా రూపొందుతోన్న చిత్రం ‘లైగర్‌’. ‘సాలా క్రాస్‌ బ్రీడ్‌’ అనేది ట్యాగ్‌లైన్‌ . ఈ చిత్రంలో అనన్యా పాండే హీరోయిన్‌ గా నటిస్తున్నారు. విజయ్‌ బాక్సర్‌గా నటిస్తున్న ఈ సినిమాలో రమ్యకృష్ణ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. పూరి జగన్నాథ్, చార్మీ కౌర్, కరణ్‌ జోహార్, అపూర్వా మెహతా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమా తాజా షెడ్యూల్‌ ముంబయ్‌లో గురువారం మొదలైంది. ‘‘ఈ సినిమా కోసం విజయ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. విజయ్‌ క్యారెక్టర్‌ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది’’ అని చిత్రబృందం తెలియజేసింది. 

మరిన్ని వార్తలు