Vijay Deverakonda‌: ‘లైగర్’వచ్చేస్తున్నాడు

11 Feb, 2021 10:03 IST|Sakshi

టాలీవుడ్ క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ  ఫ్యాన్స్‌కి గుడ్‌ న్యూస్‌ అందించింది చార్మి.  పూరి జగన్నాథ్- విజయ్ దేవరకొండ కాంబోలో రాబోతున్న లైగర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు.  తెలుగు హిందీతో పాటు తమిళం, కన్నడ, మలయాళంభాషాల్లో రూపొందుతున్న ఈ సినిమాప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్‌ 9న విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు 'లైగర్' కొత్త పోస్టర్ షేర్ చేసిన చార్మీ.. 'సెప్టెంబర్‌ 9వ తేదీ నుంచి మీ దగ్గర్లోని థియేటర్స్‌లో పంచ్ ప్యాక్' అని పేర్కొన్నారు. 

ఇక తాజాగా విడుదల చేసిన కొత్త పోస్టర్‌లో విజయ్‌ దేవరకొండ హై వోల్టేజ్ పంచ్ లుక్కుతో ఆకట్టుకుంటున్నారు. ఇప్పటికే విడుదలైన ‘లైగర్‌’ ఫస్ట్‌లుక్ ప్రేక్షకుల్లో అంచనాలు పెంచగా, తాజాగా విడుదల చేసిన కొత్త పోస్టర్ ఆ అంచనాలను రెట్టింపు చేసింది.

చార్మీ, కరణ్ జోహార్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో విజయ్‌కి బాలీవుడ్‌ భామ అనన్య పాండే జోడీగా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ముంబైతో పాటు విదేశాల్లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో బాలీవుడ్  హీరో సునీల్ శెట్టి కూడా నటిస్తున్నాడు.

మరిన్ని వార్తలు