బాలీవుడ్‌కి హాయ్‌

24 Sep, 2020 01:37 IST|Sakshi

‘అర్జున్‌రెడ్డి’ విజయంతో క్రేజీ స్టార్‌ అయ్యారు హీరో విజయ్‌ దేవరకొండ. ఇప్పుడాయన బాలీవుడ్‌ ఎంట్రీ ఖరారయిందని సమాచారమ్‌. హిందీలో ‘కాయ్‌ పో చే’, ‘కేదార్‌నాథ్‌’ తదితర హిట్‌ చిత్రాలను అందించిన దర్శకుడు అభిషేక్‌ కపూర్‌ దర్శకత్వంలో ఓ సినిమాతో విజయ్‌ ఎంట్రీ ఇవ్వనున్నారట. ఈ సినిమాకు బాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ, భూషణ్‌కుమార్‌ సహనిర్మాతలుగా వ్యవహరించనున్నారని సమాచారం.

గత ఏడాది భారత్‌–పాకిస్తాన్‌ సైనికుల మధ్య జరిగిన దాడిలో భారత వింగ్‌కమాండర్‌ అభినందన్‌ వర్థమాన్‌ పాకిస్తాన్‌ సైనికుల చేతికి చిక్కిన విషయం తెలిసిందే. మూడు రోజులు బంధీగా ఉంచి, పాక్‌ ప్రభుత్వం అభినందన్‌ని భారత ప్రభుత్వానికి అప్పగించింది. అభినందన్‌ జీవితం ఆధారంగా అభిషేక్‌ కపూర్‌ ఈ సినిమా రూపొందించనున్నారట. ఈ స్క్రిప్ట్‌ని విజయ్‌ దేవరకొండ విని, నటించడానికి అంగీకరించారని సమాచారం. అభినందన్‌ పాత్రనే విజయ్‌ చేయనున్నారట. అయితే ఇంకా ఈ ప్రాజెక్ట్‌కి విజయ్‌ దేవరకొండ సంతకం చేయలేదని బాలీవుడ్‌ టాక్‌.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు