ఈ సీన్స్‌ కోసం వెయ్యిమంది సెట్‌లో ఉండాలి : విజయ్‌ దేవరకొండ

7 Jul, 2021 11:06 IST|Sakshi

‘లైగర్‌’ సినిమా సెట్స్‌లోకి త్వరలోనే అడుగుపెట్టనున్నారు విజయ్‌ దేవరకొండ. పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ ప్యాన్‌ ఇండియన్‌ మూవీలో అనన్యా పాండే హీరోయిన్‌గా నటిస్తున్నారు. రమ్యకృష్ణ కీలక పాత్రధారి. ఇందులో విజయ్‌ దేవరకొండ బాక్సర్‌గా కనిపిస్తారు. ఈ సినిమా నెక్ట్స్‌ షెడ్యూల్‌ ముంబయ్‌లో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ‘లైగర్‌’ సినిమా చిత్రీకరణ గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో విజయ్‌ దేవరకొండ మాట్లాడుతూ –‘‘మా సినిమా చిత్రీకరణ 65 శాతం పూర్తయింది.

తల్లి, కొడుకులకు సంబంధించిన సెంటిమెంట్‌ సీన్స్‌ను కూడా దాదాపు పూర్తి చేశాం. కానీ క్లైమ్యాక్స్‌ సన్నివేశాల చిత్రీకరణకు దాదాపు వెయ్యిమంది సెట్స్‌లో ఉండాలి. ప్రస్తుత పరిస్థితుల్లో అంతమందితో చిత్రీకరణ అంటే కొంత రిస్క్‌తో కూడుకున్న పని. ‘లైగర్‌’ లాంటి భారీ సినిమా చేయడం అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో పెద్ద సవాల్‌ అనే చెప్పాలి. అలాగే కరోనా థర్డ్‌ వేవ్‌ అవకాశాలను కూడా ఆలోచించి చిత్రీకరణను ప్లాన్‌ చేస్తున్నాం’’ అని పేర్కొన్నారు.


 

మరిన్ని వార్తలు