కోతుల కోసం విజయ్‌ ఫ్యాన్స్‌ ఏం చేశారో తెలిస్తే మెచ్చుకోకుండా ఉండరు..

24 May, 2021 18:13 IST|Sakshi

చెన్నై : కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా సామాన్య ప్రజలే కాదు..జంతువులు కూడా అల్లాడిపోతున్నాయి. సరైన ఆహారం అందక విలవిల్లాడిపోతున్నాయి. ఇప్పటికే కొందరు సెలబ్రిటీలు జంతువులు, పక్షుల సంరక్షణకు జాగ్రత్తలు వహించాలని సోషల్‌ మీడియా వేదికగా విఙ్ఞప్తులు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్‌ అభిమానులు చేసిన ఓ మంచి పని ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతోంది. వివరాల్లోకి వెళితే..ద‌ళ‌ప‌తి విజయ్‌ విజ‌య్ అభిమాన సంఘం మ‌క్క‌ల్ ఇయ‌క్కం అనే పేరుతో తమిళనాడులో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

తాజాగా పుదుకోట్టై ప్రాంతంలో కోతుల కోసం ఓ వాటర్‌ ట్యాంక్‌ సహా అరటిపళ్లను ఏర్పాటు చేశారు. పుదుకోట్టై హనుమాన్‌ టెంపుల్‌కి సమీపంలో దాదాపు 300 కోతులు ఉన్నాయని, అయితే లాక్‌డౌన్‌ కారణంగా భక్తులు లేక కోతులకు ఆహారం అందడం లేదని సమాచారం. అంతేకాకుండా ఇదే ప్రాంతానికి దగ్గర్లో ఓ అటవీ ప్రాంతం ఉందని, అయితే వేసవి కావడంతో కోతులకు నీటి సదుపాయం లేక అల్లాడిపోతున్నాయని, అందుకే కోతుల కోసం ప్రత్యేకంగా దీన్ని ఏర్పాటు చేసినట్లు వివరించారు. 

చదవండి : కరోనా విలయ తాండవం.. తళపతి విజయ్‌ ఔదార్యం
కొంతమందిని కోల్పోయా: సోనూసూద్‌ భావోద్వేగం

మరిన్ని వార్తలు