నో ఫైన్‌ ఫర్‌ విజయ్‌.. కేసు క్లోజ్‌ చేస్తూ ఉత్తర్వులు

29 Jul, 2021 08:18 IST|Sakshi

చెన్నై: తనకు విధించిన రూ.లక్ష జరిమానా ప్రభుత్వ కరోనా నివారణ నిధికి చెల్లించడం ఇష్టం లేదని విజయ్‌ న్యాయస్తానానికి తెలిపారు. ఈయన ఇంగ్లాండ్‌లో కొనుగోలు చేసిన రోల్స్‌రాయిస్‌ కారుకు సంబంధించిన ట్యాక్స్‌ విషయంగా ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి ఎస్‌ఎం సుబ్రమణియం విజయ్‌కు రూ.లక్ష జరిమానా విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో విజయ్‌ హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. విచారణ జరిపిన డివిజన్‌ బెంచ్‌ ప్రత్యేక న్యాయస్థానం ఉత్తర్వులపై తాత్కాలిక స్టే విధించింది.

ఇలాంటి పరిస్థితుల్లో విజయ్‌కు విధించిన జరిమానా చెల్లింపునకు సంబంధించి ప్రకటన దాఖలు చేసే విషయంపై ప్రత్యేక న్యాయమూర్తి ఎస్‌ ఎం సుబ్రమణ్యం సమక్షంలో బుధవారం విచారణ జరిగింది. జరిమానాను ప్రభుత్వ కరోనా నివారణ నిధికి ఎందుకు జమ చేయలేదని న్యాయమూర్తి ప్రశ్నించారు. అందుకు విజయ్‌ తరఫు న్యాయవాది గత ఏడాది ప్రభుత్వ కరోనా నివారణ నిధికి రూ.25 లక్షలు అందించినట్లు,  అందువల్ల రూ.లక్ష జరిమానాను కరోనా నివారణ నిధిగా చెల్లించడం ఇష్టం లేదని తెలియచేశారు. దీంతో విజయ్‌పై కేసును ముగిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు.


 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు