Ganaa Movie Review: 'గణా' మూవీ రివ్యూ

17 Mar, 2023 21:36 IST|Sakshi
Rating:  

విజయ్ కృష్ణ, యోగిష జంటగా నటించిన చిత్రం 'గణా'. విజయ్ కృష్ణ స్వీయ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించారు. గణా సినిమాతో హీరోగానూ, దర్శకుడిగా మార్చి 17న ప్రేక్షకుల ముందుకొచ్చారు. మరి గణా సినిమా ఎలా ఉంది? సినీ ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించింది? రివ్యూలో చూద్దాం.

అసలు కథేంటంటే..

గణా (విజయ్ కృష్ణ) పోర్ట్ ఏరియాలోని ఇల్లీగల్ డ్రగ్స్ బిజినెస్‌కు కింగ్‌. మినిస్టర్‌ కోటేశ్వరరావు అండ కూడా ఉంటుంది. మినిస్టర్‌కు అడ్డు వచ్చినా వోడ్కా దాస్‌ (నాగ మహేష్‌)ను గణా చంపేస్తాడు. తన అన్నను చంపాడని దాము పగ పెంచుకుంటాడు. గణాను ఓడించాలని చూస్తాడు. ఇదే క్రమంలో మినిస్టర్‌కు సైతం గణా ఎదురు తిరుగుతాడు. ఇక గణాకు డాక్టర్ సౌమ్య (యోగిష)తో ప్రేమ వ్యవహారం నడుస్తూ ఉంటుంది. ఇంతలో గణాకు సౌమ్య తండ్రిని చంపే కాంట్రాక్ట్ వస్తుంది? ఆ తరువాత ఏం జరుగుతుంది? గణా సౌమ్యల మధ్య ఏం జరుగుతుంది? గణా జీవితంలో ప్రియ కథ ఏంటి? అసలు గణా ఫ్లాష్‌ బ్యాక్ ఏంటి? చివరకు గణా ఏం చేశాడు? అన్నది థియేటర్లో చూడాల్సిందే. 

ఎలా ఉందంటే.. 

గణా సినిమాలో దర్శకుడు, హీరో ఒక్కడే కావడం ప్లస్. అదే మైనస్‌ కూడా. దర్శకుడిగా కంటే హీరోగానే ఎక్కువ ప్రేమ చూపించినట్టు అనిపిస్తుంది. హీరో ఎలివేషన్స్ కోసమే దర్శకుడు కొన్ని సీన్లు, షాట్స్ పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. హీరోయిజాన్ని ఎలివేట్ చేసే ప్రయత్నం చేశారు. ప్రతీ సీన్‌లో హీరోయిజం కనిపించేలా సీన్లను డిజైన్ చేసుకున్నాడు దర్శకుడు కమ్ హీరో విజయ్ కృష్ణ.

ప్రథమార్థంలో ఎమోషనల్ పాళ్లు కాస్త తక్కువే ఉంటుంది. యాక్షన్ పార్ట్ ఎక్కువగా ఉంటుంది. ఎదురన్నదే లేకుండా దూసుకుపోయే గణా పాత్రతో ప్రేక్షకుడు ప్రయాణిస్తాడు. ఇంటర్వెల్ సీన్ నుంచి ఎమోషనల్ ట్రాక్ కాస్త లైన్‌లోకి వస్తుంది. ద్వితీయార్థంలో ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్‌లో ట్విస్టులు మెప్పిస్తాయి.

ఎవరెలా చేశారంటే..
గణా సినిమాలో విజయ్ కృష్ణ ఆల్ రౌండర్‌గా అనిపిస్తాడు. యాక్షన్, కామెడీ, ఎమోషనల్ సీన్స్‌లో అందరినీ ఆకట్టుకుంటాడు. హీరోయిన్లుగా యోగిష, తేజులు అందంగా కనిపించడమే కాదు చక్కగా నటించారు.  ప్రతి నాయకులుగా కనిపించిన మినిస్టర్ కోటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే, వోడ్కా దాస్ (నాగ మహేష్‌), దాము వంటి పాత్రలు ఆకట్టుకుంటాయి. ప్రభు చేసిన పోలీస్ పాత్ర కూడా అందరినీ మెప్పిస్తుంది. జబర్దస్త్ అప్పారావ్, దొరబాబుల కామెడీ కూడా ఓకే అనిపిస్తుంది. సాంకేతికత విషయాకొనిస్తే పర్వాలేదనిపిస్తుంది. ఎడిటింగ్‌ లోపాలున్నా కూడా అంతగా ప్రభావం చూపించదు. సినిమాటోగ్రఫీ బాగుంది.నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

Rating:  
(2.5/5)
మరిన్ని వార్తలు