లియో కొత్తగా మళ్లీ వస్తున్నాడు.. 18 ఏళ్లు నిండిన వారికి మాత్రమే ఎందుకంటే?

1 Nov, 2023 09:51 IST|Sakshi

కోలీవుడ్‌ హీరో ‘లియో’ సినిమా అక్టోబర్‌ 19న భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల మధ్యకు వచ్చింది. లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో విజయ్‌, త్రిష జంటగా నటించిన ఈ చిత్రం గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. సినిమా మిక్స్‌డ్‌ టాక్‌ వచ్చినా కలెక్షన్ల పరంగా రూ. 500 కోట్ల మార్క్‌ను దాటినట్లు తెలుస్తోంది. LCU లో భాగంగా ఖైదీ, విక్రమ్ లాంటి సినిమాలు బ్లాక్‌బస్టర్‌ కొట్టాయి. లియో కూడా తమిళ్‌ వర్సెన్‌ బాగానే సక్సెస్‌ అయింది. కానీ తెలుగు ప్రేక్షకులకు అంతగా రీచ్‌ కాలేదని చెప్పవచ్చు.

లియో సినిమాకు సెన్సార్‌ వారు సుమరు 15కు పైగా కట్స్‌ ఇచ్చారు. ఆ సమయంలో ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్‌ ఇచ్చారు. సెన్సార్‌ వారు కట్‌ చేసిన సీన్లు ఉండుంటే ఇంకా బాగుండేది అని విజయ్‌ ఫ్యాన్స్‌ ఇప్పటికే పలుమార్లు లియో మేకర్స్‌ను కోరారు. దీంతో లోకేష్‌ టీమ్‌ కీలకమైన నిర్ణయం తీసుకుంది. అభిమానుల కోరుకున్నట్లుగా నవంబర్‌ 3 నుంచి జీరో కట్స్‌తో లియో సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు అఫీషియల్‌ ప్రకటన వచ్చేసింది. కానీ ఈ సినిమా కేవలం 18 ఏళ్లు పూర్తిగా నిండిన వారి కోసం మాత్రమేని షరతు పెట్టారు.

కాబట్టి నవంబర్‌ 3 నుంచి చిన్నపిల్లలతో ఈ సినిమాకు వెళ్తే అనుమతి ఉండదని వారు తెలిపారు. దీనికి ప్రధాన కారణం ఎక్కువగా రక్తపాతం ఉన్న సీన్లు మళ్లీ ఈ సినిమాలో చేర్చుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా జంతు నరబలులు లాంటి సీన్లు ఉన్నాయట... వాటిని మొదట సెన్సార్‌ వారు అంగీకరించలేదు. ప్రస్తుతం వాటిని ప్రసారం చేయాలంటే A సర్టిఫికెట్‌ తప్పనిసరి అయింది. ఇప్పుడు ఎలాంటి కట్స్‌ లేకుండా నవంబర్‌ 3 నుంచి ఆడియన్స్‌ ముందుకు రానుంది లియో. కాబట్టి మళ్లీ చూడాలంటే పిల్లలతో కాకుండా 18 ఏళ్లు నిండిన వారు థియేటర్‌కు వెళ్లవచ్చు.

మరిన్ని వార్తలు