‘మాస్టర్‌’ రొమాంటిక్‌ ప్రోమో : మాలవిక మాయ

8 Jan, 2021 20:31 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తమిళహీరో విజయ్‌ నటించిన లేటెస్ట్‌ మూవీ ‘మాస్టర్’ 4వ ప్రోమోను చిత్ర యూనిట్‌ శుక్రవారం విడుదల చేసింది. విజయ్‌తో పాటు ప్రముఖ తమిళ సూపర్ స్టార్ విజయ్ సేతుపతి కూడా నటిస్తున్న ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ సంగీతం మరింత ఆకర్షణగా నిలవనుంది. ముఖ‍్యంగా  అందం వాడి చూపేరా అనే పాట  యువతను ఉర్రూతలూగించేలా, అద్భుతంగా ఉంది. అలాగే ఈ  లవ్లీ, రొమాంటిక్‌ ప్రోమోలో కాలేజీ లెక్చరర్‌గా మాలవికా మోహనన్  గ్రేస్‌ లుక్‌లో అలరిస్తోంది. మరి తన అందంతో ఏం మాయ చేస్తుందో చూడాలి.

తెలుగు, తమిళంలో ఈ సినిమా  జనవరి 13న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టీజర్‌, ప్రోమోలతో భారీ హైప్‌ క్రియేట్‌ చేసిన ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి.  లోకేష్ కనకరాజ్ తెరకెక్కించిన ఈ చిత్రంపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. విడుదలైన కొద్దిసేపట్లోనే ఈ టీజర్ ను సుమారు 5 లక్షల మంది వీక్షించారంటేనే మాస్టర్‌ మ్యాజిక్‌ను ఊహించుకోవచ్చు. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో విజయ్ సేతుపతి ప్రతినాయక పాత్రలో కనిపించనున్నారు. వీరిద్దరి మధ్య చోటుచేసుకునే  ఉత్కంఠ భరిత సన్నివేశాల కోసం ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఈ మూవీ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. మరోవైపు సినిమా థియేటర్లు, మల్టీప్లెక్సుల్లో ప్రేక్షకుల సీటింగ్ సామర్థ్యాన్ని 100 శాతం ఆక్యుపెన్సీ నిర్ణయం నుంచి తమిళనాడు ప్రభుత్వం వెనక్కి తగ్గింది. కరోనా నిబంధనల నేపథ్యంలో 50 శాతం మాత్రమే ఉండాలన్న కేంద్రం సూచన మేరకు సర్కార్‌ తాజా నిర్ణయం తీసుకుంది. దాంతో విజయ్ సినిమా ఓపెనింగ్స్‌పై సందేహాలు నెలకొన్నాయి. 

మరిన్ని వార్తలు