అనారోగ్యంతో తండ్రి.. తన పంతాన్ని పక్కన పెట్టేసిన విజయ్‌.. ఆ గొడవలకు ఫుల్‌స్టాప్‌

14 Sep, 2023 10:49 IST|Sakshi

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వరుస సినిమాలు చేస్తూ కోట్లు గడిస్తున్నాడు. ఇక సినిమాల విషయం పక్కన పెడితే.. విజయ్‌కు, ఆయన తండ్రి చంద్ర శేఖర్‌కు మధ్య విబేధాలు ఉన్నట్లు ఎప్పటినుంచో పుకార్లు వస్తున్న విషయం తెల్సిందే. విజయ్‌కు తెలియకుండా చంద్రశేఖర్.. ఆయన పేరు మీద రాజకీయ పార్టీ పేరుతో ఆఫీస్ పెట్టడం నచ్చని విజయ్.. సొంత తండ్రి మీదనే పోలీస్ కేసు పెట్టాడు. అప్పట్లో ఈ విషయం పెద్ద సంచలనాన్నే సృష్టించింది. ఈ విబేధాల గురించి ఇప్పటివరకు తండ్రి కొడుకుల ఒక్కసారి కూడా నోరు మెదపలేదు.

(ఇదీ చదవండి: Harsha Sai: సినిమా ప్రకటించిన హర్షసాయి.. నిర్మాతలుగా సీఎం బంధువుతో పాటు బిగ్‌బాస్‌ బ్యూటీ)

తాజాగా తన తండ్రి గుండెకు సంబంధించిన శస్త్రచికిత్స చేయించుకున్నాడు. దీంతో తన పంతాలను విజయ్‌ పక్కనబెట్టేశాడు. చంద్రశేఖర్‌ను కలిసి ఆయన యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నాడు. చాలా రోజుల తర్వాత తన కుమారుడు ఇంటికి రావడంతో విజయ్‌కు నచ్చిన వంటలను శోభా రెడీ చేయించారట. కొద్దిరోజుల క్రితం అమెరికా వెళ్లిన విజయ్‌ రెండురోజుల క్రితమే చెన్నైకి తిరిగొచ్చాడు. ఆపై వెంటనే తన తండ్రి ఇంటికి వెళ్లి ఆయన్ను పరామర్శించాడు. ఆ సమయంలో తన తల్లి శోభాతో కలిసి ఫోటోలు దిగాడు. ఇప్పుడు అవి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. చాలా కాలం తర్వాత, నటుడు విజయ్ తన తల్లిదండ్రులతో కలిసి ఫోటో దిగాడు. దీంతో ఆయన అభిమానులు కూడా ఎంతగానో సంతోషిస్తున్నారు.

అలాగే విజయ్‌ నటించిన వారసుడు చిత్రంలో  తండ్రి సెంటిమెంట్ గురించి నటుడు విజయ్ మాట్లాడినప్పుడు.. నిజజీవితంలో తండ్రిని, తల్లిని పక్కన పెట్టాడని సోషల్ మీడియాలో ఆయనపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ఈ వ్యాఖ్యలకు ముగింపు పలికేలా నటుడు విజయ్ తన తండ్రి, తల్లిని కలుసుకుని వారితో ఫోటో దిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో లియోలో విజయ్  నటిస్తున్న విషయం తెలిసిందే.. దాదాపు షూటింగ్ పూర్తికావడంతో తుది మెరుగులు దిద్దుతున్నారు. అక్టోబర్ 19న సినిమాను విడుదల చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది.

మరిన్ని వార్తలు