ఇట్స్‌ సెలబ్రేషన్‌ టైమ్‌ అంటున్న సమంత..నయన్‌తో కలిసి సందడి

24 Aug, 2021 10:22 IST|Sakshi

తమిళ సినిమా: నటి సమంతకిది సెలబ్రేషన్‌ టైమ్‌. ఇటీవల జరిగిన ఇండియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ మెల్‌బోర్న్‌లో ది ఫ్యామిలీ మెన్‌– 2 వెబ్‌ సిరీస్‌కు గాను సమంత ఉత్తమ నటి అవార్డు గెలుచుకున్నారు. ప్రస్తుతం ఈమె తెలుగులో శాకుంతలం అనే చారిత్రాత్మక కథా చిత్రంతో పాటు తమిళంలో కాత్తు వాక్కుల రెండు కాదల్‌ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో నటి నయనతార మరో కథానాయిక. విజయ్‌ సేతుపతి కథానాయకుడిగా నటిస్తున్నారు.
(చదవండి: నేను ప్రేమలో పడిపోయా : జగపతి బాబు)

నయనతార ప్రియుడు విఘ్నేశ్‌ శివన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర షూటింగ్‌ తాజా షెడ్యూల్‌ పాండిచ్చేరిలో జరుగుతోంది. ఈ చిత్ర షూటింగ్‌లో నటి సమంత కూడా పాల్గొన్నారు. ఉత్తమ నటి అవార్డు అందుకున్న సమంతను కాత్తు వాక్కుల రెండు కాదల్‌ చిత్ర సెట్లో కేక్‌ కట్‌ చేయించి సెలబ్రేషన్‌ చేసుకున్నారు.  

మరిన్ని వార్తలు