NBK 107: బాలయ్య సినిమాకు నో చెప్పిన విలక్షణ నటుడు

19 Aug, 2021 20:34 IST|Sakshi

నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఎన్‌బీకే107 అనే వర్కింగ్‌ టైటిల్‌తో బాలకృష్ణ బర్త్‌డే సందర్భంగా దీనిపై అధికారిక ప్రకటన వెలువడింది. అప్పటికి నుంచి ఈ మూవీలోని హీరోయిన్‌, విలన్‌లకు సంబంధించిన వార్తలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మొదట బాలయ్య సరసన హీరోయిన్‌గా శృతీ హాసన్‌, త్రిష పేర్లు వినిపించగా ఆ తర్వాత మెహ్రీన్‌ కౌర్‌ పర్‌జాదా పేరు తెరపైకి వచ్చింది.

చదవండి: బాలయ్యతో తలపడనున్న తమిళ విలక్షణ నటుడు

ఆ తర్వాత విలన్‌ పాత్ర కోసం తమిళ విలక్షణ నటుడు విజయ్‌ సేతుపతిని సంప్రదించినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ తాజా బచ్‌ ప్రకారం ఈ మూవీలో విలన్‌గా నటించేందుకు విజయ్‌ సేతుపతి నో చెప్పినట్లు టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. బాలయ్య సినిమాకు విజయ్‌ నో చెప్పడం ఏంటని అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నాయి. ప్రస్తుతం ఈ న్యూస్‌ హాట్‌ టాపిక్‌గా మారింది. దీనితో పాటు మరో వార్త కూడా బయటకు వచ్చింది. అయితే మొదట దర్శకుడు గోపిచంద్‌ హీరోయిన్‌గా శ్రుతి హాసన్‌ను సంప్రదించగా ఆమె సున్నితంగా ఈ ఆఫర్‌ను తిరస్కరించినట్లు తెలుస్తోంది.

అయితే బాలయ్య మీద ఉన్న అభిమానం, డైరెక్టర్‌ సెంటిమెంట్‌ను కాదనలేక శ్రుతి అతిథి పాత్ర ఏమైనా ఉంటే చేస్తాని ఆఫర్‌ ఇచ్చిందట. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌ శ్రుతి నటించడం లేదని స్పష్టత వచ్చేసింది. బాలయ్యతో సందడి చేయనుంది మెహ్రీన్‌ హా లేక త్రిష అనేది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. మొత్తానికి ఎన్‌బీకే 107 మూవీని స్టార్‌ నటీనటులతో చేయాలని ప్లాన్‌ చేసుకున్న గోపిచంద్‌కు ఇలా చేదు అనుభవం ఎదురైందంటూ సినీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.

చదవండి: బిగ్‌బాస్‌ 5: కంటెస్టెంట్స్‌ కొత్త జాబితా, ఈసారి వీళ్లే నో డౌట్‌!

మరిన్ని వార్తలు