కత్తితో కేక్‌ కట్‌ చేసిన హీరో.. క్షమాపణలు

16 Jan, 2021 13:50 IST|Sakshi

చెన్నై : ఈ మధ్య కాలంలో పుట్టినరోజు వేడుకల్లో కొన్ని అసాధారణ దృశ్యాలు కనిపిస్తున్నాయి. వెరైటీగా ఉంటుందని చెప్పి తల్వార్‌, గన్‌తో కేక్‌ కట్‌ చేస్తున్నారు కొందరు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడం.. జనాలు వారి మీద దుమ్మెత్తిపోయడం వంటివి చూస్తూనే ఉన్నాం. సామాన్యులనే ఇంతలా తిడితే.. ఇక ఇవే పనులు హీరోలు చేస్తే.. ఇంకెంత ట్రోలింగ్‌ జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బహిరంగంగా క్షమాపణలు చెప్పే వరకు వదలరు నెటిజనులు. తాజాగా తమిళ హీరో విజయ్‌ సేతుపతి ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు. వివరాలు నేడు విజయ్‌ సేతుపతి పుట్టినరోజు. ఈ నేపథ్యంలో దర్శకుడు పొన్రామ్‌ తన టీంతో కలిసి విజయ్‌ కోసం కేక్‌ తీసుకువచ్చారు. అయితే వెరైటీగా ఉంటుందని చెప్పి కత్తితో కేక్‌ కట్‌ చేయించారు. ఇక ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో నెటిజనులు ఓ రేంజ్‌లో ట్రోల్‌ చేయడం స్టార్ట్‌ చేశారు. దాంతో విజయ్‌ సేతుపతి క్షమాపణలు చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకుంటానని వెల్లడించారు. (చదవండి: గుర్తుండిపోయే జ్ఞాపకం)

ఈ మేరకు విజయ్‌ సేతుపతి తన ట్విట్టర్‌లో ‘నా పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు చెప్పిన వారందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పుట్టిన రోజు సందర్భంగా తీసిన ఓ ఫోటో ప్రస్తుతం వివాదాస్పదం అవుతుంది. దీంట్లో నేను కత్తితో కేట్‌ కట్‌ చేశాను. నేను దర్శకుడు పొన్రామ్ చిత్రంలో నటించబోతున్నాను. ఇందులో కత్తి ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇక నేను నా పుట్టిన రోజును పొన్రామ్, బృందంతో జరుపుకున్నాను. దాంతో కేక్‌ కట్‌ చేయడానికి కత్తిని ఉపయోగించాను. ఈ పనితో నేను సమాజంలోకి తప్పుడు సంకేతాలు పంపానని చాలా మంది అభిప్రాయపడ్డారు. ఇక మీదట నేను జాగ్రత్తగా ఉంటాను. నా పనితో ఎవరినైనా బాధపెట్టినట్లయితే, క్షమాపణలు కోరుతున్నాను. నా చర్యకు చింతిస్తున్నాను’ అంటూ విజయ్‌ సేతుపతి తమిళ్‌లో ట్వీట్‌ చేశారు. (చదవండి: సిరీస్‌ కోసం సీరియస్‌)

గతంలో, చెన్నై పోలీసులు తమ పుట్టినరోజు కేక్‌ను కత్తితో కట్‌ చేసినందుకు స్థానిక గూండాలను అరెస్టు చేశారు. ఇప్పుడు విజయ్ సేతుపతి అదే నేరం చేశారు. మరి తనను కూడా అరెస్టు చేస్తారా అని నెటిజనులు ప్రశ్నిస్తున్నారు. ఇక తాజాగా విజయ్‌ సేతుపతి నటించిన మాస్టర్‌ చిత్రం మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. 

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు