Vijay Sethupathi: కృతీ శెట్టితో సినిమా.. తనను తీసేయమని చెప్పిన హీరో

23 Sep, 2023 16:45 IST|Sakshi

ఉప్పెన సినిమాతో వెండితెరకు హీరోయిన్‌గా పరిచయమైంది కృతీ శెట్టి. తొలి సినిమాతోనే గ్రాండ్‌ ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మకు ఈ మధ్య సరైన హిట్స్‌ రావడం లేదు. దీంతో ఎలాగైనా హిట్‌ కొట్టి ఫామ్‌లోకి రావాలని ఆశపడుతోందీ బ్యూటీ. ప్రస్తుతం తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో ఒక్కేసి సినిమా ఆమె చేతిలో ఉన్నాయి. అయితే గతంలో ఆమెకు విజయ్‌ సేతుపతితో కలిసి నటించే ఛాన్స్‌ వచ్చినట్లే వచ్చి చేజారిందట!

హీరోయిన్‌ కృతీ శెట్టి అని తెలిసిన సేతుపతి తనతో నటించనని తెగేసి చెప్పాడట! దీంతో బేబమ్మకు ఆ ఆఫర్‌ చేజారిపోయింది. గతంలోనూ దీనిపై క్లారిటీ ఇచ్చిన సేతుపతి తాజాగా మరోసారి కృతీని ఎందుకు రిజెక్ట్‌ చేశాడో చెప్పుకొచ్చాడు. 'ఉప్పెన సినిమాలో బేబమ్మ(కృతీ శెట్టి)కు తండ్రిగా నటించాను. ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. ఆ తర్వాత నేను తమిళంలో ఓ సినిమాకు సంతకం చేశాను. నాకు జోడీగా కృతీ శెట్టి అయితే బాగుంటుందని మేకర్స్‌ భావించారు.

హీరోయిన్‌ ఈవిడే అంటూ నాకు తన ఫోటో పంపించారు. అది చూసిన వెంటనే చిత్రయూనిట్‌ను పిలిచి తను వద్దని చెప్పాను. ఎందుకంటే అప్పటికే ఉప్పెనలో ఆమెకు తండ్రిగా నటించాను. అలాంటిది రొమాంటిక్‌గా తనతో నటించడం నాకిష్టం లేదు. అందుకే హీరోయిన్‌గా తనను తీసుకోవద్దని సూచించాను' అని చెప్పుకొచ్చాడు. కాగా సేతుపతి ప్రస్తుతం మహారాజా, మేరీ క్రిస్‌మస్‌, గాంధీ టాక్స్‌ సహా తదితర ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు.

చదవండి: బిగ్‌బాస్‌కు వచ్చేముందు జీరో బ్యాలెన్స్‌.. ఆఖరికి దుస్తులు కూడా లేవా? ప్రిన్స్‌ పరిస్థితి ఇంత దారుణంగా ఉందా?

మరిన్ని వార్తలు