రణసింగం నేరుగా ఓటీటీకే

12 Sep, 2020 06:35 IST|Sakshi

విజయ్‌ సేతుపతి, ఐశ్వర్యా రాజేశ్‌ జంటగా నటించిన తమిళ చిత్రం ‘క పే రణసింగం’. విరుమాండి దర్శకత్వం వహించిన ఈ చిత్రం రైతుల పోరాటం నేపథ్యంలో ఉంటుంది.  హీరోహీరోయిన్‌ రైతుల వైపు నిలబడి ఎలాంటి పోరాటం చేశారన్నది కథాంశం. లాక్‌డౌన్‌ వల్ల ఈ సినిమా విడుదల వాయిదా పడింది. తాజాగా ఈ సినిమాను నేరుగా ఓటీటీలో(జీ ఫ్లెక్స్‌) విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది జీ సంస్థ. పేఫర్‌ వ్యూ (డబ్బు కట్టి వీక్షించడం) పద్ధతిలో ఈ సినిమా విడుదల కానుంది. విడుదల తేదీ ఇంకా ప్రకటించలేదు. తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాను  విడుదల చేస్తున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు