వినాయక చవితి బరిలో విజయ్‌ సేతుపతి ‘లాభం’

7 Sep, 2021 15:14 IST|Sakshi

విజ‌య్ సేతుప‌తి ‘లాభం’ సెన్సార్ పూర్తి

విజయ్ సేతుపతి శ్రుతిహాసన్ జంటగా  తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన చిత్రం ‘లాభం’. రెండు భాషల్లోనూ ఒకేసారి విడుదల చేయనున్నారు. ఎస్‌.పి.జననాథన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జగపతిబాబు, సాయి ధన్సిక ప్రధాన పాత్రలు పోషించారు.  లాయ‌ర్ శ్రీరామ్ స‌మ‌ర్పించిన ఈ చిత్రాన్ని  శ్రీ గాయత్రీ దేవి ఫిలిమ్స్ పతాకంపై నిర్మాత బత్తుల సత్యనారాయణ (వైజాగ్ సతీష్) తెలుగులో విడుద‌ల చేయనున్నారు.  ఈ మూవీకి హరీష్ బాబు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం క్లీన్ ‘యూ’ సర్టిఫికేట్‌ను పొందింది. కాగా వినాయకచవితి సందర్భంగా సెప్టెంబర్ 9న సినిమాను విడుద‌ల చేస్తున్నట్లు మూవీ టీం తెలిపింది. 

చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ..  ‘విజయ్ సేతుప‌తి, శ్రుతిహాస‌న్ జంట‌గా రూపొందిన లాభం చిత్రాన్ని సెప్టెంబ‌ర్ 9న తెలుగు, త‌మిళ భాష‌ల్లో భారీ ఎత్తున విడుద‌ల చేయనున్నాం.  సినిమాను చూసిన సెన్సార్ సభ్యులు అభినందించి క్లీన్ ‘యు’ సర్టిఫికేట్ ఇచ్చారు.  ఓ మంచి సినిమాను మా బ్యాన‌ర్‌లో ప్రేక్ష‌కుల‌కు ముందుకు తీసుకురావడం ఎంతో ఆనందంగా ఉంద’ని తెలిపారు. ఈ సినిమాలో సేతుపతి డిఫరెంట్ పాత్రలో క‌నిపించ‌నున్నట్లు చెప్పారు. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కులు చూసి ఎంజాయ్ చేసేలా క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌తో డైరెక్ట‌ర్ ఎస్‌.పి.జ‌న‌నాథ‌న్ ఈ సినిమాను రూపొందించినట్లు,  ఢీ అంటే ఢీ అనేలా ఉన్న సేతుప‌తి, జ‌గ‌ప‌తిబాబు పాత్ర‌లు  ప్రేక్ష‌కుల‌ను మెస్మరైజ్ చేస్తాయని మూవీ టీం తెలిపింది.

మరిన్ని వార్తలు