థ్రిల్‌ అవుతారు

16 Oct, 2020 00:50 IST|Sakshi

నిత్యామీనన్‌ ఏదైనా ప్రాజెక్ట్‌లో భాగమైతే ఆటోమేటిక్‌గా ఆ సినిమా మీద ఆసక్తి పెరగడం ఖాయం. అందుకు కారణం ఆమె ఎంపిక చేసుకునే కథలు, చేసే పాత్రలు వినూత్నంగా ఉండటమే. తాజాగా మలయాళంలో ఓ ప్రాజెక్ట్‌ ఓకే చేశారామె. విజయ్‌ సేతుపతి, నిత్యామీనన్‌ జంటగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఇందు వీయస్‌ అనే నూతన దర్శకురాలు ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ ఏడాది మొదట్లోనే ఈ సినిమా ప్రారంభం కావాల్సింది. కోవిడ్‌ వల్ల చిత్రీకరణ ప్రారంభం ఆలస్యం అయింది.

తాజాగా కేరళలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభించనున్నారు. నిత్యామీనన్‌ మాట్లాడుతూ – ‘‘కథ వినగానే ఈ సినిమా నా టేస్ట్‌కి కరెక్ట్‌గా సరిపోయేది అనిపించింది. నాకు చాలా ఇష్టమైన స్టయిల్లో ఈ సినిమా కథ సాగుతుంది. మా పాత్రలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఓ సాధారణ అమ్మాయి జీవితంలో జరిగిన అనూహ్య సంఘటనలతో ఈ కథ ఉంటుంది. ప్రేక్షకులు థ్రిల్‌ ఫీల్‌ అవుతారు’’ అన్నారు. ముందుగా ఇన్‌డోర్‌ సన్నివేశాలు చిత్రీకరించి, తర్వాత అవుట్‌ డోర్‌ సన్నివేశాలు తీస్తారని తెలిసింది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు