డైరెక్టర్‌ మృతి, హాస్పిటల్‌ బిల్‌ కట్టిన విజయ్‌ సేతుపతి

17 Mar, 2021 18:41 IST|Sakshi

తమిళ స్టార్‌ హీరో విజయ్‌ సేతుపతి ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో ముందుంటారు. ఇటివల లాక్‌డౌన్‌లో ఆనారోగ్యంతో ఆస్పత్రి పాలైన ఓ హస్య నటుడికి ఆర్థిక సాయింతో పాటు వైద్య చికిత్సకు డబ్బు సాయం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా విజయ్‌ మరోసారి తన ఉదారతను చాటుకున్నాడు. కష్టకాలంలో తనని ఆదరించిన దర్శకుడు ఎస్పీ జననాథన్‌ హాస్పిటల్‌ బిల్లు కట్టి కృతజ్ఞత తిర్చుకున్నాడు. కాగా మార్చి 14న తమిళ దర్శకుడు ఎస్పీ జగనాథన్‌ బ్రెయిన్‌ స్ట్రోక్‌తో మరణించిన సంగతి తెలిసిందే. జననాథన్‌, విజయ్‌తో ‘లాభం’  అనే చిత్రం తీస్తున్న సంగతి తెలిసిందే. ఇదే ఆయన చివరి చిత్రం.

ఇటీవల షూటింగ్‌‌ను పూర్తి చేసకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్‌ప్రోడక్షన్‌ పనులను జరుపుకుంటోంది. అయితే ఈ మూవీ విడుదల కాకముందే ఆయన ఆకస్మికంగా మరణించడంతో చిత్ర యూనిట్‌ తీవ్ర దిగ్ర్భాంతికి గురైంది. కెరీర్‌ ప్రారంభంలో  తనను ఆర్థికంగా ఆదుకోవడమే కాకుండా ఆకలితో ఉన్నప్పుడు అన్నం పెట్టిన దర్శకుడి మరణం విజయ్‌ సేతుపతిని బాగా కలచివేసింది. జననాథన్‌ చేసిన సాయాన్ని గుర్తు పెట్టుకున్న విజయ్ ఇప్పుడు హాస్పిటల్ ఛార్జీలు మొత్తం కట్టి ఆయన రుణం తీర్చుకున్నాడట.

దర్శకుడు జననాథన్‌ కుటుంబ సభ్యులను విజయ్‌ ఒక్క రూపాయి కూడా కట్టనివ్వలేదట. అంతేకాదు ఆయన అనారోగ్యం వార్త తెలియగానే అందరికంటే ముందు విజయ్‌ స్పందించి హాస్పిటల్‌కి వెళ్లి పలకరించాడట. ఆయన చనిపోయాడని తెలిసిన అనంతరం అంతిమ సంస్కారాలు పూర్తయ్యేవరకు జననాథన్ కుటుంబంతో పాటే ఉండి కన్నీటీ పర్యంతరం ఆయ్యారట. ఆయన స్టార్ హీరో అన్న విషయం పక్కన పెట్టి సామాన్యుడిలా అక్కడ అందరితో కలిసిపోయాడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఇది తెలిసి ఆయన అభిమానులు తమ అభిమాన హీరోని చూసి మురిసిపోతున్నారు. 

చదవండి: 
నిహారిక కొత్త సినిమా.. కీలక పాత్రలో విజయ్‌ సేతుపతి

ఆ దర్శకుని కుటుంబంలో మరో తీరని విషాదం
ప్రముఖ దర్శకుడు కన్నుమూత

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు