Vijay Sethupathi: మరో సూపర్‌స్టార్‌తో విజయ్‌ సేతుపతి  

5 Nov, 2022 09:11 IST|Sakshi

ఇతర కథానాయకులకు భిన్నమైన నటుడు విజయ్‌ సేతుపతి. ఈయనకు హీరోగా స్టార్‌ డమ్‌ ఉన్నా దాని పక్కన పెట్టి ఇమేజ్‌ అనే చట్రంలో ఇరుక్కోకుండా నచ్చిన, వచ్చిన అవకాశాలను వదలుకోకుండా నటిస్తుంటారు. ప్రస్తుతం విజయ్‌సేతుపతి గాంధీ టాకీస్, మేరీ క్రిస్మస్‌ చిత్రాల్లో హీరోగా నటిస్తున్నారు. అలాగే మైఖేల్, విడుదలై, జవాన వంటి చిత్రాల్లో ఇతర హీరోలతో కలిసి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇకపోతే తెలుగు మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా నటించిన సైరా నరసింహారెడ్డి చిత్రంలో కీలక పాత్రలోనూ,

తమిళంలో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కు విలన్‌గా పేట చిత్రంలో, కమలహాసన్‌కు విలన్‌గా విక్రమ్‌ చిత్రంలో, విజయ్‌కు ప్రతినాయకుడిగా మాస్టర్‌ చిత్రంలోనూ పోటీ పడి నటించి మెప్పించారు. కాగా తాజాగా మలయాళం సూపర్‌స్టార్‌ మమ్ముట్టితో కలిసి నటించడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి మణికంఠన్‌ దర్శకత్వం వహించనున్న విషయం తెలిసిందే. ఇందులోనూ విజయ్‌ సేతుపతి విలన్‌గానే కనిపిస్తారని సమాచారం. ఈ రేర్‌ కాంబినేషన్లో రూపొందనున్న చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది.  

మరిన్ని వార్తలు