ఓటీటీలో సమంత, నయనతారల మూవీ, ఎప్పుడు? ఎక్కడంటే?

19 May, 2022 08:53 IST|Sakshi

Kaathuvaakula Rendu Kaadhal OTT Release Date: విజయ్‌ సేతుపతి హీరోగా నయనతార, సమంత హీరోయిన్లుగా నటించిన చిత్రం 'కాతువాక్కుల రెండు కాదల్‌'. కామెడీ ట్రయాంగిల్‌ లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో కణ్మని రాంబో ఖతీజాగా రిలీజైంది. విఘ్నేశ్‌ శివన్‌ దర్శకత్వం వహించగా కోలీవుడ్‌ మ్యూజిక్‌ సెన్సేషన్‌ అనిరుద్‌ రవిచందర్‌ సంగీతం అందించాడు. రౌడీ పిక్చర్స్‌, సెవెన్‌ స్క్రీన్‌ స్టూడియోస్‌ బ్యానర్‌పై విఘ్నేశ్‌, నయనతార, ఎస్‌ ఎస్‌ లలిత్‌ కుమార్‌ సంయుక్తంగా నిర్మించారు. ఏప్రిల్‌ 28న రిలీజైన ఈ మూవీ అటు కోలీవుడ్‌ ఇటు టాలీవుడ్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇద్దరమ్మాయిలు కణ్మని, ఖతీజాల మధ్య రాంబో ఎలా నలిగిపోయాడన్నేదే సినిమా కథ. థియేటర్లలో రిలీజైన నెల రోజులకే ఓటీటీలో వస్తోంది.

తాజాగా ఈ మూవీ ఓటీటీ బాట పట్టింది. హాట్‌స్టార్‌లో మే 27 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించింది హాట్‌స్టార్‌. థియేటర్లలో సినిమా చూడటం మిస్‌ అయినవాళ్లు మరికొద్ది రోజులు వెయిట్‌ చేసి ఓటీటీలో మూవీ చూసి ఎంజాయ్‌ చేయండి.

చదవండి 👇

'మహేశ్‌బాబును ఇలా చూస్తామని జన్మలో అనుకోలేదు' అంటున్నారు

కాస్మొటిక్‌ సర్జరీ వెంటపడుతున్న తారలు.. ప్రాణాలకు ప్రమాదం అని తెలిసినా డోంట్‌ కేర్‌!

మరిన్ని వార్తలు