Vijay 66: విజయ్-వంశీ పైడిపల్లి సినిమా వచ్చేది ఆ పండుగకే..

10 May, 2022 20:34 IST|Sakshi

Vijay Vamshi Paidipally Movie Will Release In 2023: కోలీవుడ్ స్టార్‌ హీరో విజయ్‌, నేషనల్‌ క్రష్ రష్మిక మందన్నా జంటగా ఓ సినిమా రానుంది. ఈ మూవీకి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, పీవీపీ బ్యానర్‌పై పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి సంయుక్తంగా భారీ స్థాయిలో చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విజయ్‌ 66వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి మంగళవారం (మే 10) తాజా అప్‌డేట్‌ ఇచ్చారు మేకర్స్‌. ఈ మూవీలో భారీ తారాగణం కనువిందు చేయనుందని సమాచారం. 

ఈ చిత్రంలో శరత్‌ కుమార్, ప్రభు, ప్రకాశ్‌ రాజ్‌, శ్రీకాంత్, జయసుధ కనువిందు చేయనున్నారట. వీరితో పాటు శామ్‌, యోగిబాబు, సంగీత, సంయుక్త తదితరులు కీలక పాత్రల్లో సందడి చేయనున్నారు. అలాగే ఈ మూవీని 2023 సంక్రాంతి కానుకగా రిలీజ్‌ చేస్తున్నట్లు చిత్రబృందం పేర్కొంది. ఎస్ తమన్‌ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. భారీ తారాగణంతోపాటు అత్యున్నత సాంకేతిక నిపుణులు కూడా వర్క్‌ చేస్తున్నారు. 

చదవండి: పరాశక్తిలా బిందు మాధవి ఫోజు.. శూర్పణఖ ఆడియెన్స్ నీ ముక్కు కోస్తారు


మరిన్ని వార్తలు