సంక్రాంతి బరిలోకి ‘వారసుడు’

25 Sep, 2022 06:36 IST|Sakshi

విజయ్‌ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘వారిసు’ (తెలుగులో ‘వారసుడు’). ఇందులో రష్మికా మందన్నా హీరోయిన్‌గా నటిస్తున్నారు. ‘దిల్‌’రాజు, శిరీష్, పరమ్‌ వి పొట్లూరి, పెరల్‌ వి. పొట్లూరి నిర్మిస్తున్న ఈ సినిమా ఫైనల్‌ షెడ్యూల్‌ నేడు (ఆదివారం) ఆరంభం కానుంది.‘‘రెండు యాక్షన్‌ సీన్లు, రెండు పాటలు చిత్రీకరిస్తే సినిమా పూర్తవుతుంది. సంక్రాంతికే సినిమాను రిలీజ్‌ చేస్తాం’’ అని శనివారం చిత్ర యూనిట్‌ ప్రకటించింది.

మరిన్ని వార్తలు