Tamannaah Vijay Varma: తమన్నాకి భాయ్ ఫ్రెండ్ వేరే లెవల్ ఎలివేషన్స్

10 Jul, 2023 16:42 IST|Sakshi

Tamannaah Vijay Varma: హీరోయిన్ తమన్నా ఈ మధ్య తెగ ట్రెండింగ్ అవుతోంది. నటుడు విజయ్ వర్మతో రిలేషన్, ముద్దుల దగ్గర నుంచి మొదలుపెడితే వెబ్ సిరీసుల్లో వీరిద్దరూ రెచ్చిపోవడం వరకు ఒకటా, రెండా.. ఎక్కడ చూసినా మిల్కీ బ్యూటీనే. చేతిలో ఉన్న సినిమాలు తక్కువేమో గానీ వస్తున్న వార్తలు మాత్రం బోలెడు. ఇప్పుడు ఇదంతా కాదన్నట్లు విజయ్ వర‍్మ.. ఈమె డ్యాన్స్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

తమన్నా ఊరమాస్
సినిమాలు, వెబ్ సిరీసులతో బిజీగా ఉన్న తమన్నా.. ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీకాంత్ 'జైలర్'లో నటిస్తోంది. ఈ మూవీ నుంచి రీసెంట్ గా 'కావాలా..' లిరికల్ పాటని విడుదల చేశారు. ట్యూన్ క్యాచీగా ఉంది. ఇందులో తమన్నా డ్యాన్స్ సూపర్ గా ఉంది. ఊరమాస్ స్టెప్పులతో అదరగొట్టింది. యూట్యూబ్ లో ఈ సాంగ్ తెగ ట్రెండ్ అవుతోంది.

(ఇదీ చదవండి: రెచ్చిపోతున్న తమన్నా.. ఆ విషయం అర్థమైపోవడం వల్లే!)

సినిమా దేవత
గతేడాది వరకు సింగిల్ గానే ఉన్న తమన్నా.. ప్రస్తుతం నటుడు విజయ్ వర్మతో రిలేషన్‌షిప్ మెంటైన్ చేస్తోంది. వీళ్లిద్దరూ జంటగా నటించిన 'లస్ట్ స్టోరీస్ 2' ఈ మధ్యే రిలీజైంది. అందులో శృంగార సన్నివేశాలు, ముద్దులతో ఈ జోడీ రెచ్చిపోయింది. ఇక తమన్నా లేటెస్ట్ సాంగ్ చూసిన విజయ్ వర్మ ఫిదా అయిపోయాడు. 'పాట ఫైర్ పుట్టిస్తోంది. సినిమా దేవుడు, దేవత' అని విజయ్ రాసుకొచ్చాడు. 

లవర్‌ని ఓ రేంజులో
అయితే ఈ క్యాప్షన్ లో రజినీకాంత్ ని సినిమా దేవుడు అని విజయ్ వర్మ చెప్పడం వరకు బాగానే ఉంది. కానీ తమన్నాని ఏకంగా దేవత అని ఎలివేషన్ ఇవ్వడం మాత్రం ఆశ‍్చర్యపరిచింది. ఎంత లవర్ అయితే మాత్రం ఈ రేంజు ఎలివేషన్స్ ఎలా భయ్యా అని నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

(ఇదీ చదవండి: గుర్తుపట్టలేనంతగా మారిన సామ్.. ఆ ఆరు నెలలు!)

మరిన్ని వార్తలు