Vijaya Raghavan Review: ‘విజయ రాఘవన్‌’మూవీ ఎలా ఉందంటే..

17 Sep, 2021 23:27 IST|Sakshi
Rating:  

టైటిల్‌ : విజయ రాఘవన్‌
నటీనటులు : విజయ్‌ ఆంటోని, ఆత్మిక, రామచంద్రరాజు, ప్రభాకర్ తదితరులు
నిర్మాతలు : టి.డి.రాజా, డి.ఆర్‌. సంజయ్‌ కుమార్‌
దర్శకత్వం:  ఆనంద కృష్ణన్‌
సంగీతం :  నివాస్‌ కె.ప్రసన్న
సినిమాటోగ్రఫీ :  ఎన్‌.ఎస్‌.ఉదయ్‌కుమార్‌
ఎడిటింగ్‌: విజయ్‌ ఆంటోని
విడుదల తేది : సెప్టెంబర్‌ 17, 2021

‘న‌కిలీ, డా.సలీమ్‌, బిచ్చగాడు, భేతాళుడు, ఇంద్రసేన, రోషగాడు, కిల్లర్‌’ వంటి చిత్రాలతో టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సంపాదించుకున్న హీరో విజయ్‌ ఆంటోని. ఈయన హీరోగా.. ‘మెట్రో’ వంటి డిఫరెంట్‌ మూవీని తెరకెక్కించిన డైరెక్టర్‌ ఆనంద కృష్ణన్‌ తెరకెక్కించిన‌ చిత్రం ‘విజయ రాఘవన్‌’.  ఇన్ఫినిటీ ఫిల్మ్‌ వెంచర్‌ సమర్పణలో చెందూర్ ఫిల్మ్‌ ఇంటర్నేషనల్‌ బ్యానర్‌పై టి.డి.రాజా, డి.ఆర్‌.సంజయ్‌ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు.  ‘కోడియిల్ ఒరువ‌న్‌’ పేరుతో త‌మిళంలో రూపొందిన ఈ చిత్రాన్ని శ్రీకరి ఫిలింస్ బ్యానర్‌పై ర‌విచంద్రా రెడ్డి, శివారెడ్డి తెలుగులో విడుద‌ల చేశారు. ‘విజ‌య రాఘ‌వ‌న్‌’  పేరుతో తెలుగులో సెప్టెంబ‌ర్ 17న ప్రేక్షకుల ముందుకు వ‌చ్చింది. మ‌రి ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ను ఏమేర‌కు మెప్పించిందో రివ్యూలో చూద్దాం. 

క‌థేంటంటే?
అరకులోని ఓ గ్రామానికి చెందిన విజ‌య రాఘ‌వ‌న్ (విజ‌య్ ఆంటోని) త‌న త‌ల్లి ఆశ‌యం కోసం ఐఏఎస్ కావాల‌నుకుంటాడు. ఇందుకోసం ఆయ‌న హైద‌రాబాద్ వ‌చ్చి ఒక ప‌క్క పిల్ల‌ల‌కు ట్యూష‌న్ చెబుతూ.. మ‌రో ప‌క్క ఐఏఎస్‌కు ప్రిపేర్ అవుతూ ఉంటాడు. అయితే అనుకోకుండా విజ‌య్ రాఘ‌వ‌న్ లోక‌ల్ రాజ‌కీయాల్లోకి త‌ల‌దూర్చాల్సివ‌స్తుంది. దాని వ‌ల్ల‌ ఐఏఎస్ ఐఏఎస్ ఇంటర్వ్యూ అడ్డంకులు వ‌స్తాయి. ఒక‌వైపు త‌ల్లికిచ్చిన మాట మ‌రోవైపు రాజ‌కీయనాయ‌కులు ఒత్తిడి. చివ‌రికి ఆ కాల‌నీకి కార్పొరేట్ గా ఎన్నిక‌వుతాడు. విజ‌య రాఘ‌వ‌న్ రాజ‌కీయాల్లోకి ఎందుకు రావాల్సి వ‌చ్చింది? ఆయ‌న కార్పొరేటర్ గా ఎలా గెలిచాడు ?  త‌ల్లికి ఇచ్చిన మాట‌ను నెర‌వేర్చాడా లేదా? అనేదే మిగ‌తా క‌థ‌.

ఎవ‌రెలా చేశారంటే.. 
విజయ రాఘవన్‌ పాత్రలో కనిపించిన విజయ్‌ ఆంటోని తన హావభావాలతో చక్కగా నటించాడు. త‌ల్లికి ఇచ్చిన మాట కోసం పాడుప‌డే ఓ మంచి కొడుకుగా త‌నదైన న‌ట‌న‌తో సినిమా భారం మొత్తాన్ని భూజాన వేసుకొని న‌డిపించాడు.  పోరాట స‌న్నివేశాల్లో విజ‌య్ చ‌క్క‌గా న‌టించాడు. అలాగే ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించిన ఆత్మిక, రామచంద్రరాజు, ప్రభాకర్ మిగిలిన నటీనటులు కూడా తమ నటనతో ఆకట్టుకున్నారు.

ఎలా ఉందంటే?
‘మెట్రో’ వంటి డిఫరెంట్‌ మూవీని తెరకెక్కించి విమ‌ర్శ‌కుల ప్ర‌సంస‌లు అందుకున్న  ఆనంద కృష్ణన్  ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన రెండో చిత్ర‌మే విజ‌య రాఘ‌వ‌న్‌.  ఐఏఎస్ ఆఫీస‌ర్ కావాల‌నుకునే ఓ యువ‌కుడి క‌థే ఇది. జీవితంలో ఎన్నో సాధించాల‌నుకునే హీరో, త‌న త‌ల్లి కోరిక‌ను తీర్చాల‌నుకుంటాడు. ఆ క్ర‌మంలో కొన్ని స‌మ‌స్య‌ల్లో చిక్కుకుంటాడు. వాటి నుంచి త‌నెలా బ‌య‌ట‌ప‌డ‌తాడు అనేదే ఈ చిత్రం. స‌మాజంలో మ‌న‌కు ఎదుర‌య్యే రాజ‌కీయ ప‌ర‌మైన ఇబ్బందులను ఎలా హ్యాండిల్ చేయాల‌నే సందేశం కూడా ఇస్తుంది. మారుమూల గ్రామం నుంచి సిటీవ‌ర‌కు జ‌రుగుతున్న రాజ‌కీయ నాయ‌కుల అవినీతి, ప్ర‌భుత్వాధికారుల చేతివాటం, బెదిరింపు రాజ‌కీయాలు వంటి అంశాల‌న్నీ ద‌ర్శ‌కుడు క‌ళ్ళ‌కు క‌ట్టిన‌ట్లు చూపించాడు.ముఖ్యంగాభ్ర‌ష్టుప‌ట్టిన‌ట్లుగా ఉన్న గ‌వ‌ర్న‌మెంట్ కాల‌జీని హీరో శుభ్రం చేయడం, అక్క‌డివారిని చైత‌న్య‌వంతుల్ని చేయ‌డం అనే అంశాలు, స‌న్నివేశాలు ప్ర‌తి ఒక్క‌రిని ఆలోచింప‌జేస్తాయి. అలాగే మ‌ద‌ర్ సెంటిమెంట్ సీన్స్  ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అవుతాయి.

కథలో చెప్పాలనుకున్న మెయిన్ థీమ్ అలాగే కొన్ని సన్నివేశాలలో మంచి పనితీరుని కనబర్చిన దర్శకుడు ఆనంద కృష్ణన్‌.. కొన్ని సీన్స్‌లో నెమ్మ‌దిగా క‌నిపించారు. ఆ సన్నివేశాలను కూడా ఇంకా ఆసక్తికరంగా మలిచే అవకాశం ఉన్నప్పటికీ, ఆనంద కృష్ణన్‌ మాత్రం వాటిని సింపుల్ గా నడిపారు. సెకండాఫ్ చాలా వ‌ర‌కు సినిమాటిక్‌గా సాగుతుంది. మ‌ధ్య మ‌ధ్య‌లో వ‌చ్చే కొన్ని అన‌వ‌స‌ర‌పు సీన్స్ ప్రేక్ష‌కుల‌కు కాస్త బోర్ కొట్టిస్తాయి. నివాస్‌ కె.ప్రసన్న సంగీతం బాగుంది. పాట‌లు అంతంత మాత్ర‌మే అయిన‌ప్ప‌టికీ నేప‌థ్య సంగీతం అదిరిపోయింది. ఎన్‌.ఎస్‌. ఉదయ్‌కుమార్‌ సినిమాటోగ్రఫీ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. సినిమాలోని చాలా సన్నివేశాలను ఆయన ఎంతో రియలిస్టిక్ గా, మంచి విజువల్స్ తో చాలా బ్యూటిఫుల్ గా చూపించారు. సినిమా స్థాయికి త‌గిన‌ట్లుగా ఉన్నాయి.

Rating:  
(2.75/5)
Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు