భీమ్‌ గెటప్‌ ఓకే... మరి.. రామరాజు?

23 Jul, 2021 00:30 IST|Sakshi

కొమురం భీమ్‌ ముస్లిమ్‌ గెటప్‌లో ఎందుకు కనిపించాడు? అసలు కథ ఏంటి? అనే చర్చకు రచయిత విజయేంద్ర ప్రసాద్‌ ఫుల్‌స్టాప్‌ పడేలా చేశారు. రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో కొమురం భీమ్‌ పాత్రను ఎన్టీఆర్‌ చేస్తున్న విషయం తెలిసిందే. రాజమౌళి ప్రతి సినిమాకీ కథ అందిస్తున్న విజయేంద్ర ప్రసాద్‌ ఈ చిత్రానికి కూడా రచయిత. కాగా ఎన్టీఆర్‌ ముస్లిమ్‌ గెటప్‌ గురించి చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో ‘‘నిజామ్‌ పోలీసులు తన కోసం గాలిస్తున్న సమయంలో తప్పించుకునే క్రమంలో భీమ్‌ తన వేషాన్ని మార్చుకుంటాడు.

ముస్లిమ్‌  టోపీ పెట్టుకుంటాడు’’ అన్నారు విజయేంద్ర ప్రసాద్‌. దాంతో కొమురం భీమ్‌ ముస్లిమ్‌ గెటప్‌ గురించి అందరికీ స్పష్టత వచ్చేసింది. కానీ, అల్లూరి సీతారామరాజు పోలీస్‌ గెటప్‌లో ఎందుకు కనిపించాడు? అనే చర్చ మాత్రం కొనసాగుతోంది. సీతారామరాజు పాత్రను రామ్‌చరణ్‌ చేస్తున్న విషయం తెలిసిందే. మరి.. రామరాజు పోలీస్‌ గెటప్‌లోకి మారడానికి గల కారణం ఏంటీ? అంటే.. అదే ఇంటర్వ్యూలో ‘‘ఆ రహస్యం ప్రతి ప్రేక్షకుడినీ ఆశ్చర్యపరుస్తుంది’’ అన్నారు రచయిత. సో.. పోలీస్‌ గెటప్‌ గురించి సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఈ సినిమా అక్టోబరు 13న విడుదల కానుంది.
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు