Suhasini Maniratnam: ఫోకస్‌ మూవీ నుంచి సుహాసిని ఫస్ట్‌లుక్‌ విడుదల

24 Feb, 2022 17:53 IST|Sakshi

విజ‌య్ శంక‌ర్, అషూ రెడ్డి, సుహాసిని మ‌ణిర‌త్నం, భానుచంద‌ర్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో జి. సూర్య‌తేజ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న సస్పెన్స్‌ థ్రిల్లర్ మూవీ  ‘ఫోకస్‌’. మర్డర్‌ మిస్టరీ బ్యాక్‌డ్రాప్‌లో ఆసక్తికరమైన క‌థ‌-క‌థ‌నాల‌తో ప్రేక్షకులను ఆద్యంతం ఆశ్చర్యపరిచే విధంగా ఈ మూవీ తెరకెక్కింది. ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌, వేలంటైన్స్‌డే సంద‌ర్భంగా రిలీజైన పోస్ట‌ర్స్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

తాజాగా ఫోక‌స్ మూవీ నుంచి సీనియ‌ర్ న‌టి సుహాసిని మ‌ణిరత్నం స్పెష‌ల్ లుక్ పోస్ట‌ర్‌ను సినీ రచయిత విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ విడుదల చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘సూర్య‌తేజ త‌న డెబ్యూ మూవీగా రిలాక్స్ మూవీ మేక‌ర్స్ ప‌తాకంపై `ఫోక‌స్` అనే చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. విజ‌య్‌శంక‌ర్, అషూ రెడ్డి హీరోహీరోయిన్లు. సుహాసిని గారు ముఖ్య పాత్ర‌లో న‌టించారు. ఇప్పుడే టీజ‌ర్ చూశాను. చాలా బాగుంది. ఇంకా మంచి పాత్ర‌లు చాలా ఉన్నాయి. అంద‌రూ  ఈ సినిమాని చూసి ఎంక‌రేజ్ చేయండి. టీమ్ అంద‌రికీ ఆల్ ది బెస్ట్‌’ అన్నారు. 

ద‌ర్శ‌కుడు జి. సూర్య‌తేజ మాట్లాడుతూ..  ‘నేను ద‌ర్శక‌త్వం వ‌హించిన‌ మొద‌టి చిత్రం `ఫోక‌స్`. ఈ సినిమాలోని సుహాసిని గారి లుక్‌ను ఎన్నో సూప‌ర్ హిట్ చిత్రాల‌కు క‌థల‌ను అందించిన విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ గారు విడుద‌ల చేయ‌డం చాలా సంతోషంగా ఉంది. భాను చంద‌ర్‌, షియాజీ షిండే, జీవా, సూర్య భ‌గ‌వాన్ ఇలా చాలా మంది ఆర్టిస్టులు ఈ సినిమాలో న‌టించారు. షూటింగ్ పూర్త‌యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ జ‌రుగుతోంది. మార్చిలో రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం’ అని పేర్కొన్నారు. స్కైరా క్రియేషన్స్‌ సమర్పణలో రిలాక్స్‌ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

మరిన్ని వార్తలు