Vijayendra Prasad Praises RGV: వర్మపై ప్రశంసలు కురిపించిన రచయిత విజయేంద్ర ప్రసాద్‌

14 Jul, 2022 13:54 IST|Sakshi

సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మపై ప్రమఖ సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్‌ ప్రశంసలు కురిపించారు. నిన్న(బుధవారం) జరిగిన అమ్మాయి మూవీ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కు విజయేంద్ర ప్రసాద్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శివ సినిమా నాటి దర్శకుడు మళ్లీ కనిపించారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పది నెలల క్రితం కనబడుట లేదు మూవీ ఆడియో ఫంక్షన్‌కు తనని అతిగా పిలిచారని, అదే కార్యక్రమానికి వర్మ కూడా వచ్చాడన్నారు. ఆ సందర్భంగా దాదాపు 15 ఏళ్ల పాటు వర్మపై తనలో గూడుకట్టుకంటున్న కోపం, చిరాకు, బాధ, అసహ్యం అన్ని కలిపి ఆరోజు ఒక్కసారిగా బయటకు తీశానన్నారు. 

చదవండి: లండన్‌లో సీక్రెట్‌గా ‍హీరో పెళ్లి..!

‘‘శివ సినమా చూశా. ఎంతో స్ఫూర్తి పొందా. వందల మంది రచయితలు, డైరెక్టర్లు, టెక్నిషియన్లు వర్మ వల్ల ప్రేరణ పొంది ఇండస్ట్రీకి వచ్చారు. కానీ ఇప్పుడు ఆనాటి వర్మ కనిపించడం లేదు. మీకు కనిపిస్తే చెప్పండి మళ్లీ శివ లాంటి సినిమా తీయమని’’ అన్నాను అని గుర్తు చేసుకున్నారు . అయితే ‘ఆ రోజు ఇలా అనొచ్చో లేదో కానీ నాలోని ఆవేశం అలా అనిపించేలా చేసింది. కానీ ఇప్పుడు అమ్మాయి సినిమా చూస్తుంటే నాకు శివ నాటి వర్మ మళ్లీ కనిపించారు. ఇప్పుడు గర్వం చెబుతున్నా.. వర్మ గారు మీలో ఆనాటి డైరెక్టర్‌ నాకు మళ్లీ కనిపించారు. శివ కంటే వంద రెట్లు ఎక్కువగా కనిపించారు. ఈ సినిమా 40వేల థియేటర్లో విడుదలవ్వడమంటే సాధారణ విషయం కాదు. 

చదవండి: దాని కోసం నేను ప్రెగ్నెంట్‌ అని చెప్పాల్సి వచ్చింది: రెజీనా

నిజంగా ఇది అద్భుతమైన విషయం. ఈ ఘనత ఇప్పటి వరకూ ఎవరు సాధించలేదు. మన తెలుగు వారందరికి ఇది గర్వకారణం’ అంటూ వర్మను కొనియాడారు. అనంతరం విజయేంద్ర వ్యాఖ్యలపై వర్మ ఆనందం వ్యక్తం చేశారు. మీరన్న మాటలు తనకెప్పటికీ గుర్తుంటాయని, ఇవి తనకు బెస్ట్‌ కాంప్లిమెంట్స్‌ అని వర్మ వ్యాఖ్యానించాడు. కాగా మార్షల్ ఆర్ట్స్‌ నేపథ్యంలో వర్మ లడిఖి మూవీని తెరకెక్కించాడు వర్మ. దీన్ని తెలుగులో ‘అమ్మాయి’గా విడుదల చేస్తున్నారు. పూజా భలేకర్‌ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రం జూలై 15న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో బుధవారం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విజయేంద్ర ప్రసాద్‌తో పాటు సంగీత దర్శకులు ఎమ్‌ఎమ్‌ కీరవాణి హజరయ్యారు.

మరిన్ని వార్తలు