సినీ పరిశ్రమలో మరో విషాదం: ప్రముఖ దర్శకుడు కన్నుమూత

9 Dec, 2021 07:57 IST|Sakshi

సాక్షి, చెన్నై(తమిళనాడు): సినీ దర్శకుడు త్యాగరాజన్‌ బుధవారం ఉదయం చెన్నైలో కన్నుమూశారు. ప్రభు కథానాయకుడిగా వెట్రిమేల్‌ వెట్రి, విజయకాంత్‌ హీరోగా మా నగర కావలన్‌ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు త్యాగరాజన్‌. అవకాశాలు తగ్గడంతో సొంతూరు అరుంబుకోటైకి వెళ్లిపోయారు. అక్కడ ప్రమాదానికి గురైన త్యాగరాజన్‌ కోమాలోకి వెళ్లారు.

అనంతరం కోలుకున్న ఆయన మళ్లీ అవకాశాల కోసం చెన్నైకి తిరిగి వచ్చారు. ఈసారి కూడా అవకాశాలు రాకపోవడంతో స్థానిక వడప ళణి, ఏవీఎం స్టూడియో సమీపంలో రోడ్డు పక్కనే పడుకుని అమ్మా క్యాంటీన్‌లో తింటూ దీని పరిస్థితి అనుభవించారు. ఈ క్రమంలో బుధవారం వేకువజామున త్యాగరాజన్‌ కన్నుమూశారు. పోలీసులు అనాథ శవంగా భావించి మృతదేహాన్ని కీల్పాక్కం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.  

మరిన్ని వార్తలు