ఆకట్టుకుంటున్న 'విక్కీ ది రాక్ స్టార్' రివల్యూషన్ షేడ్

11 Aug, 2022 15:00 IST|Sakshi

విక్రమ్‌, అమృత చౌదరి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘విక్కీ ది రాక్‌ స్టార్‌’. సిఎస్ గంటా దర్శకత్వంలో  శ్రీమతి వర్దిని నూతలపాటి సమర్పణలో స్టూడియో87 ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రానికి ఫ్లైట్ లెఫ్టినెంట్ శ్రీనివాస్ నూతలపాటి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇటీవల విడుదల చేసిన  ఫస్ట్ షేడ్‌, లవ్ షేడ్‌లతో పాటు పాటలకు మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుంచి  రివల్యూషన్ షేడ్ అంటూ  ఓ వీడియోని విడుదల చేశారు మేకర్స్‌.

‘చచ్చిపోవడం అంటే ప్రాణాలతో లేకపోవడం కాదురా.. ధైర్యం లేకుండా బతకడం కూడా చచ్చినట్టే అని తల్లి చెప్పడం.. ‘ధైర్యం కావాలంటే ఏం చేయాలి అమ్మా?’ అని పిల్లాడు అడగటం.. ‘ధైర్యం కావాలంటే ప్రాణాల మీద ఆశ వదిలి.. పక్కోళ్ల ప్రాణాల కోసం పోరాడు.. ధైర్యం అదే వస్తుంది’ అంటూ ఆ తల్లి చెప్పిన మాటలతో ఈ సినిమాలో కథ, కథనాలు ఎలా ఉండబోతోన్నాయో అర్థమవుతుంది.షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. త్వరలోనే విడుదల తేదిని ప్రకటిస్తామని చిత్ర యూనిట్‌ పేర్కొంది.

మరిన్ని వార్తలు