డిసెంబర్‌లో షురూ

27 Nov, 2020 06:32 IST|Sakshi

విక్రమ్‌ నటిస్తున్న లేటెస్ట్‌ చిత్రం ‘కోబ్రా’. అజయ్‌ జ్ఞానముత్తు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో విక్రమ్‌ పలు గెటప్స్‌లో కనిపించనున్నారు. శ్రీనిధీ శెట్టి కథానాయిక. ప్రముఖ క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ ఈ సినిమా ద్వారా నటుడిగా పరిచయం అవుతున్నారు. కోవిడ్‌ వల్ల ఈ సినిమా చిత్రీకరణకు బ్రేక్‌ పడింది. అయితే డిసెంబర్‌ నుంచి చిత్రీకరణను మళ్లీ ప్రారంభిస్తారట. సుమారు 25 రోజుల చిత్రీకరణ మిగిలి ఉందని తెలిసింది. ‘కోబ్రా’ చిత్రాన్ని చాలా వరకూ రష్యాలో షూట్‌ చేశారు. మిగిలి ఉన్న కొంత భాగాన్ని చెన్నైలో రష్య సెట్స్‌ను వేసి షూట్‌ చేస్తారన్నది తాజా సమాచారం. థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఏఆర్‌ రెహమాన్‌ సంగీత దర్శకుడు.

మరిన్ని వార్తలు