Dhruva Natchathiram: ఏడేళ్లుగా వాయిదా పడుతూ విడుదల రేసులోకి వచ్చిన విక్రమ్‌ సినిమా

24 Sep, 2023 06:49 IST|Sakshi

నటుడు విక్రమ్‌ కథానాయకుడుగా నటించిన చిత్రం 'ధ్రువనక్షత్రం'. నటి రీతూవర్మ నాయకిగా నటించిన ఇందులో ఐశ్వర్య రాజేష్‌, సిమ్రాన్‌, పార్థిబన్‌, రాధికా శరత్‌కుమార్‌, వంశీకృష్ణ, ప్రియదర్శిని ముఖ్యపాత్రలు పోషించారు. గౌతమ్‌మీనన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రారంభమై ఏడేళ్లు అయ్యింది. నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకున్నా విడుదల విషయంలో పలు ఆటంకాలలను ఎదుర్కొంటూ వచ్చింది. పలుమార్లు విడుదల తేదీని ప్రకటించినా ఎదురవుతున్న సమస్యల కారణంగా వాయిదా పడుతూ వచ్చింది.

(ఇదీ చదవండి: రతిక మాజీ బాయ్‌ఫ్రెండ్ టాపిక్.. నాగ్ అలాంటి కామెంట్స్!)

'ధ్రువనక్షత్రం' విడుదలలో జాప్యం కారణంగా ఇటీవల చిత్రం కోసం కొన్ని సన్నివేశాలను రీషూట్‌ చేసినట్లు ప్రచారం జరిగింది. అంతేకాకుండా ఐశ్వర్య రాజేష్‌ నటించిన సన్నివేశాలను తొలగించారన్న ప్రచారం జరిగింది. అయితే ఈ విషయాన్ని ఐశ్వర్య రాజేష్‌ గానీ, చిత్ర యూనిట్‌ గానీ స్పందించలేదు. అయితే హరీష్‌ జయరాజ్‌ సంగీతాన్ని అందించిన ఈ స్పై థ్రిల్లర్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ కథా చిత్రం ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది.

దీపావళి సందర్భంగా నవంబర్‌ 24న 'ధ్రువనక్షత్రం' చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు యూనిట్‌ వర్గాలు అధికారికంగా ప్రకటించారు. కాగా దీపావళి రేస్‌లో నటుడు కార్తీ నటించిన జపాన్‌తో పాటు మరికొన్ని చిత్రాలు విడుదల కానున్నాయి. విజయ్‌ నటించిన లియో చిత్రం అక్టోబర్‌ 19న తెరపైకి రానుంది.

మరిన్ని వార్తలు