వినాయకచవితి స్పెషల్‌ మూవీ.. ‘ఎవరవయ్యా’.. అంటూ గూగుల్‌లో వెతుకులాట!!

9 Sep, 2021 14:43 IST|Sakshi

Sri Vinayaka Vijayam Movie: కొన్ని సినిమాలు ఎప్పటికీ వన్నెతరగవు. అందుకే బుల్లితెరపై ఎన్నిసార్లు ప్రజెంట్‌ చేసినా వ్యూయర్స్‌ ఆదరిస్తూనే ఉంటారు. ముఖ్యంగా పండుగల లాంటి టైంలో వీటి ప్రత్యేకత ఏంటో జనాలకు తెలిసి వస్తుంది కూడా. అలాంటి సినిమాల్లో ‘శ్రీ వినాయక విజయం’ గురించి ప్రముఖంగా చెప్పుకోవచ్చు. ప్రతీ వినాయక చవితికి క్రమం తప్పకుండా ఈ సినిమా టీవీలో వస్తూనే ఉంటుంది. అయితే ఈ ఏడాది మళ్లీ టెలికాస్ట్‌ ప్రొమో రిలీజ్‌ కావడంతో సోషల్‌ మీడియాలో ఓ ఆసక్తికరమైన చర్చ మొదలైంది.

పూర్తి స్థాయిలో గణేషుడి కథను చూపిస్తూ తెలుగులో వచ్చిన మొదటి సినిమా ‘శ్రీ వినాయక విజయం’(1979). ఈ మూవీలో కృష్ణంరాజు, వాణిశ్రీలు శివపార్వతులుగా నటించారు. కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో వినాయకుని జన్మ వృత్తాంతం చక్కగా వివరించే ప్రయత్నం చేశారు. ‘ఎవరవయ్యా.. ఎవరవయ్యా’ అంటూ సాగే గానం.. దేవులపల్లి రచన, సాలూరి స్వరాలు, సుశీలమ్మ పాడిన పాట ఇప్పటికీ పండపూట టీవీల్లో మారుమోగుతుంటుంది. అయితే ఆ వినాయకుడి గెటప్‌లో ఉన్న ఆర్టిస్ట్‌ ఎవరంటూ? గూగుల్‌ను ఆశ్రయించడంతో సినిమా ట్రెండింగ్‌లోకి వచ్చింది.
 

శ్రీ వినాయక విజయం చిత్రం భారీ సక్సెస్‌ సాధించింది. ఈ సినిమాలో బాల గణేషుడిగా కనిపించింది బేబీ లక్ష్మి సుధా. ఆ తర్వాత ఏనుగు తల గెటప్‌తోనూ కాసేపు ఈ చిన్నారి అలరించింది. ఇక పెద్దయ్యాక వినాయకుడి గెటప్‌లో నటించింది ఎంజీవీ మదన్‌గోపాల్‌ అనే ఆర్టిస్ట్‌. ఈయన గురించి పూర్తి సమాచారం, ఫొటో గురించి .. వెతకాలని ప్రయత్నిస్తున్నారు చాలామంది.

కానీ, ఎలాంటి సమాచారం దొరకడం లేదు. అలా చాలా మంది వెతకడం వల్ల వినాయక విజయం మూవీ గూగుల్‌ ద్వారా సోషల్‌ మీడియాలో ఇప్పుడు ట్రెండ్‌ అవుతోంది ఇప్పుడు.
 

చదవండి: ‘తండ్రి ఎవరు?’.. ఫైర్‌ అయిన హీరోయిన్‌

మరిన్ని వార్తలు