బాయ్‌ఫ్రెండ్‌తో లాక్‌డౌన్‌కు రెడీ అంటున్న స్టార్ హీరో‌ కూతురు

9 Apr, 2021 14:23 IST|Sakshi

బాలీవుడ్‌ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. వినూత్న సినిమాలతో దేశం అంతా అభిమానుల్ని సంపాదించుకొని మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌గా పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆయన కూతురు ఇరా ఖాన్‌ కూడా కావాల్సినంత ఫేమస్‌ అయిపోయారు. అయితే సినిమాలతో కాదు.. తన పర్సనల్‌ జీవితంలోని విషయాలతో తరుచూ వార్తల్లో నానుతున్నారు. ఇటీవల తన మానసిక సమస్యలు, తనపై జరిగిన లైంగిక దాడి విషయాలను బయటపెడుతూ సంచలనం సృష్టించిన ఆమె.. తాజాగా తన డేటింగ్ వ్యవహారంతో మరోసారి హాట్‌టాపిక్‌గా మారారు. నుపూర్ శిఖారెతో డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. 

భారత్‌లో కరోనా కేసులు అధికమవుతుండటంతో మహమ్మారి కట్టడికి కొన్ని రాష్ట్రాల్లో రాత్రి కర్ఫ్యూ, వీకెండ్‌ లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే. ఇక మహారాష్ట్ర వ్యాప్తంగా రాత్రి కర్ఫ్యూ అమలవుతోంది. అయితే ఒకవేళ మహారాష్ట్రలో మరోసారి లాక్‌డౌన్‌ విధిస్తే ఆమిర్ కూతురు ఇరా తన ప్రియుడు నుపూర్‌ కలిసి ఇంట్లోనే ఎంజాయ్‌ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ మేరకు ఇరా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ స్టోరీ పోస్టు చేశారు. బాయ్‌ఫ్రెండ్‌ నుపూర్‌తో దిగిన ఫోటోను షేర్‌ చేస్తూ లాక్‌డౌన్‌కు సిద్ధం అంటూ పేర్కొన్నారు.

చదవండి: పీకల్లోతు ప్రేమలో ఇరా ఖాన్‌

ప్రస్తుత ఈ పిక్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. లాక్‌డౌన్‌ విధిస్తారని జనాలు ఓ వైపు భయపడుతుంటే సూపర్‌స్టార్‌ కూతురు మాత్రం బాయ్‌ఫ్రెండ్‌తో ఎంజాయ్‌ చేసేందుకు లాక్‌డౌన్‌ కోసం ఎదురుచూస్తుందని నెటిజన్లు మండిపడుతున్నారు. కాగా,  గతంలో ఓ వ్యక్తిని ప్రేమించి అతనితో బ్రేకప్ చేసుకున్న ఇరా ఖాన్‌ మళ్లీ ఇప్పుడు ఫిట్‌నెస్ ట్రైనర్‌ నుపూర్‌తో ప్రేమలో మునిగి తేలుతున్నారు. ఇక నుపూర్ బాలీవుడ్‌లో పలువురు స్టార్లకు ఫిట్‌నెస్ ట్రైనర్‌గా ఉన్నారు. సుస్మితా సేన్‌కు గత పదేళ్లుగా ట్రైనర్‌గా ఉన్నారు.

చదవండి: 'కమల్‌ హాసన్‌, అజిత్‌ ద్రోహం చేశారు'

మరిన్ని వార్తలు