ఆ అలవాటుకు బానిసయ్యా: అనుపమ

15 Jul, 2021 19:17 IST|Sakshi

అందం అభినయం పుష్కలంగా ఉన్న హీరోయిన్ల జాబితాల ముందు వరుసలో ఉండే అనుపమ పరమేశ్వరన్‌ అదృష్టం పరంగా మాత్రం కాస్త వెనక ఉందనే చెప్పాలి. కెరీర్‌ మొదట్లో ‘ప్రేమమ్‌’, ‘అఆ’ సినిమాలతో మంచి గుర్తింపు సంపాదించినా, ఆ ఫేమ్‌ను నిలకడగా నిలబెట్టుకోలేకపోయింది. దీంతో ఇటీవల కెరీర్‌ పరంగా కాస్త స్లో అయ్యింది ఈ అమ్మడు. ఇక సినిమాల విషయం ఎలా ఉన్నా సోషల్‌మీడియాలో మాత్రం తన హవాను కొనసాగిస్తోంది ఈ కేరళ బ్యూటీ.

తాజాగా అనుపమ ఒకదానికి బానిసలా మారిపోయినట్లు చెప్పగా ఆ వార్త నెట్టింట వైరల్‌గా మారి హల్‌ చల్‌ చేస్తోంది. ఓ వైపు నటన, మరో వైపు క్యూట్‌ లుక్స్‌తో ఉండే అనుపమకు ఇటీవల సినిమా ఆఫర్లు పెద్దగా లేవనే తెలుస్తోంది. కాగా ప్రస్తుతం ఈ అమ్మడు నిఖిల్ సరసన 18పేజెస్, దిల్ రాజు బ్యానర్ లో ఆయన తమ్ముడు కొడుకు హీరోగా లాంచ్ అవుతున్న రౌడీ బాయ్స్ లో నటిస్తోంది. 

సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ  ఈ మధ్య తానొక వ్యక్తిని ప్రేమించినట్లు, చివరకి బ్రేకప్ కూడా జరిగిందంటూ తెలిపిన అనుపమ.. తాజాగా ఇన్‌స్టాలో గిబ్బరిష్‌ గేమ్‌కు బానిసలా మారిపోయినట్లు తెలిపింది. ఈ ఆటలో కొన్ని విచిత్ర పదాలు మనకు స్క్రీన్‌పై కనపడతాయ్‌. అందులో మనం పలికే తీరును బట్టి నిజమైన ఆంగ్ల పదాలను కనిపెట్టేయవచ్చు. ఇప్పుడు ఈ ఆటని అనుపమ ఆడటం కాదండోయ్.. దానికి తాను ఎంతగానో బానిస అయినట్లు తెలిపింది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు